Chicken: చికెన్ స్కిన్ లెస్ మంచిదా లేక స్కిన్ బెటరా.. ఇది తెలుసుకోండి?

రోజురోజుకీ మాంసాహారుల ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాగా మాంసాహార ప్రియులు ఎక్కువగా చికెన్ ని

  • Written By:
  • Publish Date - March 11, 2023 / 06:30 AM IST

రోజురోజుకీ మాంసాహారుల ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కాగా మాంసాహార ప్రియులు ఎక్కువగా చికెన్ ని ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే చికెన్ లో కొంతమంది స్కిన్ తో కలిపి తింటే మరికొంతమంది స్కిన్ లెస్ తింటూ ఉంటారు. అయితే చాలామందికి ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. స్కిన్ తో తింటే మంచిదా లేక స్కిన్ లెస్ తింటే మంచిదా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. అయితే చికెన్ స్కిన్ విషయంలో జాగ్రత్త వహించాలి అంటున్నారు వైద్యులు. మరి చికెన్ లో ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలా వరకు చికెన్ ప్రేమికులు ఎక్కువగా స్కిన్ లెస్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.

అంతేకాకుండా చికెన్ అమ్మే షాపులలో కూడా స్కిన్ లెస్ అమ్మకమే ఎక్కువగా ఉంటుంది. స్కిన్ చికెన్ కంటే స్కిన్ లెస్ చికెన్ కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉండడం, పోషక పదార్థాలు ఎక్కువ ఉండడం, శరీరానికి ఉపయోగం కలిగించే మ్యానోశాచురేటడ్ కొవ్వులు చికెన్ లో ఉంటాయి. అయితే చికెన్ స్కిన్ లో 32శాతం కొవ్వు ఉంటుంది. ఒక కేజీ చికెన్ తింటే అందులో 320 గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది. అలాగే చికెన్ స్కిన్ లో ఉండే కొవ్వులల్లో మూడింట, రెండింతలు అసంతృప్తి కొవ్వులు కలిగి ఉంటుంది. వీటినే మంచి కొవ్వు అని కూడా అంటారు. చికెన్ స్కిన్ తో తీసుకుంటే దాదాపు 50 శాతం క్యాలరీలను ఎక్కువగా పొందవచ్చు.

అదేవిధంగా 170 గ్రాముల స్కిన్ లెస్ చికెన్ తింటే 284 క్యాలరీల శరీరానికి అందుతాయి. కావున స్కిన్ తీసేసి తినడం కంటే వండేటప్పుడు స్కిన్ అలాగే ఉంచి వండాలి. దీని ద్వారా రుచి మరింత పెరుగుతుంది. కావాలంటే తినేటప్పుడు తినకుండా స్కిన్ ని పక్కన పెట్టవచ్చు. ఇది చాల మంచి పద్ధతి అని పోషకాహార నిపుణులు అంటున్నారు.