Site icon HashtagU Telugu

Eating too much garlic is dangerous : వెల్లుల్లి తినడం మంచిదే…అతిగా తింటే ఈ సమస్యలు తప్పవు.!!

Garlic Benefits

Garlic Benefits

ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. ఆరోగ్యం బాగుంటే…ఏదైనా చేయగలం. అందుకే ఆరోగ్యానికి కాపాడుకునేందుకు చక్కటి జీవనశైలిని అలవరుచుకోవాలి. నేటికాలంలో ఆరోగ్యానికి తప్పా…మిగతా వాటన్నింటికి సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా ఆరోగ్యం దెబ్బతి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని గ్రహించుకుని ఆరోగ్యానికి కాపాడుకోవాలి. ఒక్కోసారి మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటాం. సాధారణంగా సహజసిద్ధమైన పద్దతులు ఎక్కువగా అనుసరించినట్లయితే..ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం కూడా లేకపోలేదు. దీనికి ఉదాహరణ వెల్లుల్లి. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ వెల్లుల్లి వినియోగం అనేది పరిమితంగా ఉండాలి. లేదంటే ఎన్నో ఆనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం.

ఆరోగ్యానికి వెల్లుల్లి చాలా అవసరం:
వెల్లుల్లి అనేది నిజానికి ఒక ఆయుర్వేద మూలిక. ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మానవ శరీరంలోని రక్తపోటును నియంత్రించడమే కాకుండా, అనేక వ్యాధులను నయం చేసే గుణం వెల్లుల్లికి ఉంది. అయితే ప్రతిరోజూ దీన్ని తీసుకున్నట్లయితే మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చెడు శ్వాస:
పచ్చి వెల్లుల్లిని నోటిలో నమలడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది. దీని వాసన ఎక్కువ కాలం ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడలంటే ఇబ్బందికరంగా ఉంటుంది.

జీర్ణ వ్యవస్థకు భంగం:
వెల్లుల్లి గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేస్తుందనేది ఎంత నిజమో…దీన్ని ఎక్కువగా తీసుకోవడం సమస్యలు తీవ్రం అవుతాయనేది కూడా అంతే నిజం. విపరీతమైన అపానవాయువు, మలబద్ధకం కూడా వస్తుంది. కాబట్టి వెల్లుల్లిని తీసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిందే.

గుండెల్లో మంటలు:
పచ్చి వెల్లుల్లి తినడం తరచుగా గ్యాస్ట్రిక్ వ్యక్తులలో గుండెల్లో మంటను కలిగిస్తుంది. ఇది ఛాతీలో అల్సర్లకు దారితీస్తుంది.

అతిసారం:
వెల్లుల్లి వేడి పదార్ధం. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల విచిత్రమైన సమస్యలు వస్తాయి. పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినే అలవాటు ఉన్నవారిలో అతిసారం కనిపిస్తుంది.

ఎసిడిటీ సమస్య:
పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినేవారిలో ఛాతీ కుహరంలో మంట చికాకుగా ఉంటుంది. ఎసిడిటీకి దారి తీస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు దూరంగా ఉండాలి.