ఇటీవల కాలంలో డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది మన ఆహారపు అలవాట్లు, రెండవది జీవనశైలి అని చెప్పాలి. ఇకపోతే షుగర్ వ్యాధి ఒకసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు. డయాబెటిస్ పేషెంట్లు తినే ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. ఎలాంటి ఆహార పదార్థాలు పండ్లు తినాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఈ వేసవిలో డయాబెటిస్ పేషెంట్లు ఎలాంటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డయాబెటిస్ పేషెంట్స్ పండ్లు తినడం మంచిదే కానీ అన్ని రకాల పండ్లను తినకూడదట. ఒకవేళ పండ్లను తిన్నా కూడా పరిమిత మోతాదులో మాత్రమే తినాలట. ఇక వేసవి కాలంలో కొన్ని రకాల పండ్లు తినడం డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుందట. డయాబెటిస్ పేషంట్స్ జామపండు ఎక్కువగా తినడం మంచిది. జామ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. జామ పండు రక్తంలోని చక్కెరను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. అలాగే డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందట. వేసవికాలంలో మన శరీరం తొందరగా డీహైడ్రేట్ అవుతుంది.
శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవడం కోసం పుచ్చకాయ మంచి ఆహారంగా చెప్పవచ్చు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పుచ్చకాయ మంచిదే కదా అని ఎక్కువగా తినకూడదు. పరిమిత మోతాదులోనే డయాబెటిస్ పేషెంట్స్ తినాలని చెబుతున్నారు. డయాబెటిస్ పేషెంట్లు తినాల్సిన వాటిలో యాపిల్ కూడా ఒకటి. యాపిల్ పండులో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు ఎక్కువ ఆకలి కాకుండా నిరోధిస్తుందట. చక్కెర శోషణ ను తగ్గించి, మన ఇన్సులిన్ ఆక్టివిటీని మెరుగుపరుస్తుందట. కాబట్టి కనుక యాపిల్ పండును ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. వేసవికాలంలో డయాబెటిస్ పేషెంట్లు బొప్పాయిని తీసుకోవాలని చెబుతున్నారు. బొప్పాయి పండులో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గొప్ప గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండులో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, ఇది మన ఆకలిని నియంత్రి బరువు తగ్గడానికి దోహదం చేస్తుందట. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి బొప్పాయి డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుందట. ముఖ్యంగా ఈ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ వేసవికాలంలో డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు.