Food: రాత్రి మిగిలిన ఆహారాన్ని వేడి చేసి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

అప్పట్లో తినడానికి తిండి సరిగా లేకపోవడంతో రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేవారు. రాత్రిపూట మిగిలిపోయిన

  • Written By:
  • Publish Date - March 22, 2023 / 07:15 AM IST

అప్పట్లో తినడానికి తిండి సరిగా లేకపోవడంతో రాత్రి మిగిలిన అన్నాన్ని పొద్దున్నే తినేవారు. రాత్రిపూట మిగిలిపోయిన అన్నం పొద్దున్నే పెరుగులోకి కలుపుకొని వెళ్లేవారు. అయితే ఇప్పుడు కూడా చాలామంది ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. కానీ చాలామంది రాత్రిపూట మిగిలిన భోజనాన్ని ఉదయాన్నే వేడి చేసి తింటున్నారు. పారవేయడం ఇష్టం లేక రాత్రి మిగిలిన అన్నంతో ఏదైనా ఫ్రైడ్ రైస్ జీరా రైస్ పులిహోర వంటివి కలిపి తింటూ ఉంటారు. అలా రాత్రి మిగిలిన అన్నాన్ని మళ్లీ ఉదయం వేడి చేస్తున్నం వల్ల సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు..

రాత్రి మిగిలిన అన్నం ఉదయాన్నే వేడి చేసుకుని తినడం వల్ల పొట్టలో ఇన్‌ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆహారాన్ని తక్కువ మంటపై వేడి చేస్తే పరువాలేదు. అది ఆహారంలోని బాక్టీరియాను చంపడమే కాకుండా ఫుడ్‌లోని పోషక విలువలు నశించిపోకుండా చూస్తుంది. ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేస్తే అందులోని పోషకాలు కూడా నశించిపోతాయి. దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. కాబట్టి ఆహారాన్ని నిలువ చేసే ముందు కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వడం మంచిది. ముందుగా ఆహారాన్ని చల్లబరచాలి. సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకున్న ఆహారాన్ని గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయాలి.

మైక్రోవేవ్‌లో ఆహారాన్ని మళ్లీ వేడి చేయాలనుకుంటే కనీసం 65 డిగ్రీల అంతర్గత ఉష్ణోగ్రతకు చేరుకునేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేస్తే హానికారక బ్యాక్టీరియా మరణిస్తుంది. ఆహారాన్ని కనీసం 2 నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. మిగిలిపోయిన వాటిని ఒక్కసారి మాత్రమే వేడి చేయాలి. పదే పదే వేడి చేస్తుంటే ఫుడ్ పాయిజనింగ్ చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేగాక వంటకం రుచి, అందులోని పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. ఆహారాన్ని మళ్లీ వేడి చేశాక వేడి పోకుండా పాత్రలపై మూత ఉంచాలి. మాంసం వంటకాలు మళ్ళీ వేడి చేస్తే గ్రిల్ థర్మామీటర్‌తో వాటి ఉష్ణోగ్రతను కొలచుకుంటే చాలా మంచిది.