నేటి ఆధునిక జీవనశైలిలో మాంసాహారం (Non-Veg) అనేది చాలా మంది ఆహారంలో భాగంగా మారిపోయింది. చికెన్, మటన్, చేపలు వంటి నాన్-వెజిటేరియన్ ఆహార పదార్థాలు ప్రోటీన్లు, ఐరన్, ఇతర పోషకాలు సమృద్ధిగా కలిగి ఉండటంతో శరీరానికి పోషణ ఇస్తాయి. అయితే ఇవి అందరికీ పడవు. కొంతమందికి నాన్-వెజ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గుండె సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు నాన్-వెజ్ తినడం తగ్గించాలి.
Gastric Problem : గ్యాస్ట్రిక్ తో ఇబ్బందిపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి
గర్భిణీ స్త్రీలు, గుండె వ్యాధులు ఉన్నవారు, మధుమేహ రోగులు నాన్-వెజ్ తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ కారణంగా గుండె సమస్యలు పెరగడం, రక్తపోటు అదుపు తప్పడం జరుగుతుంది. అలాగే నాన్-వెజ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మారిపోవడంతో మధుమేహ రోగులకు ఇది హానికరంగా మారొచ్చు. కొన్ని సందర్భాల్లో నాన్-వెజ్ తినడం వల్ల జీర్ణక్రియ మందగించి, గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
Weekly Horoscope : వారఫలాలు.. మార్చి 16 నుంచి 22 వరకు రాశిఫలాలను తెలుసుకోండి
అలెర్జీ సమస్యలు ఉన్నవారు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు నాన్-వెజ్ ఆహారం నుంచి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా సముద్ర ఆహార పదార్థాలు లేదా మాంసాహారంలోని కొన్ని ప్రోటీన్లు అలెర్జీ సమస్యలను మరింత పెంచవచ్చు. మితమైన పరిమాణంలో నాన్-వెజ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గించే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తమ వైద్యుల సలహా తీసుకుని తమ శరీర పరిస్థితికి అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.