Sperm Color : వీర్యం రంగు.. ఇది కూడా మగవారి ఆరోగ్య స్థితిగతులకు సంకేతంగా ఉంటుంది. వీర్యం నాణ్యత, సంఖ్య కూడా కీలకమే. వీర్యం అనేది లైంగిక చర్య సమయంలో పురుష జననేంద్రియాల నుంచి రిలీజ్ అవుతుంది. దీని రంగు సాధారణంగా తెల్లగా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా పసుపు రంగులో ఉంటే.. వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నట్టే లెక్క. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కొందరిలో వీర్యకణాల రంగు పసుపు రంగులోకి(Sperm Color) మారుతుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు పురుషుల వీర్యం రంగు పసుపు రంగులోకి ఛేంజ్ అవుతుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రొస్టేట్ గ్రంథిలోకి బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ప్రొస్టాటిటిస్ అనే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనివల్లే వీర్యం పసుపు రంగులోకి మారుతుంది. కామెర్ల వల్ల కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతుంటాయి. కామెర్లతో బాధపడేవారి వీర్యం రంగు కూడా పసుపులోకి ఛేంజ్ అవుతుందని నిపుణులు అంటున్నారు. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం వల్ల ఇలా స్పెర్ప్ పసుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెక్స్ చేయడం వల్ల ఎన్నోసమస్యలు వస్తాయి. సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.
Also Read:Temple Dress Code : టోర్న్ జీన్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సులతో.. ఆ ఆలయంలోకి ఇక నో ఎంట్రీ
స్పెర్మ్ కౌంట్ లెక్క ఇదీ..
వీర్య ద్రవం మందంగా తెల్లటి ద్రవం రూపంలో ఉంటుంది. వ్యక్తిని బట్టి దాని కలర్ కొద్దిగా మారే అవకాశం ఉంది. కానీ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, జీవనశైలిలో మార్పులు, పోషకాహార లోపం వల్ల వీర్యం పలుచగా ఉండే అవకాశం ఉంది. దీన్నే వాటరీ సెమెన్ అంటారు. వీర్య ద్రవం పలుచగా నీళ్లలా ఉండటం సంతానోత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి వ్యంధ్యత్వం ఉందని చెప్పలేం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మిల్లీ లీటర్ వీర్యంలో శుక్ర కణాల సంఖ్య 15 మిలియన్ల కంటే తక్కువగా ఉంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్టుగా భావిస్తారు.