Site icon HashtagU Telugu

Heart Problems: గుండె సమస్యలు ఉన్నవారు వాకింగ్ చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపించాయా.. అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Heart Problems

Heart Problems

ఇటీవల కాలంలో గుండె సమస్యలతో చాలామంది బాధపడుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకీ ఈ గుండె సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దానికి తోడు ఈ మధ్యకాలంలో చాలామంది గుండెకు సంబంధించిన సమస్యలతోనే మరణిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం వల్ల చాలామంది ఇలాంటి లేనిపోని ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. అందుకే హెల్తీ లైఫ్ స్టైల్ తో పాటు హెల్తీ ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే గుండె సమస్యలు ఉన్నవారికి నడక మంచిదే కానీ ఇలా నడుస్తున్న సమయంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆగిపోవాలని లేదంటే అది మీ ప్రాణాలకే ప్రమాదం కావచ్చు అని చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్నవారు హెవీ వర్కౌట్స్ చేయకూడదని చెబుతున్నారు. దీనివల్ల గుండెపై భారం పెరుగుతుంది. వాకింగ్ చేస్తే గుండె బలంగా మారి రక్తాన్ని పంప్ చేయడం సరిగా మారుతుందట. తరచుగా వాకింగ్ చేయడం వల్ల ఫిట్‌నెస్ పెరిగి శరీరానికి ఆక్సిజన్ అందుతుందట, దీని వల్ల గుండె, ఊపిరితిత్తులు సరిగా పనిచేస్తాయని చెబుతున్నారు. అలాగే వాకింగ్ సరిగా చేయడం వల్ల అలసట, శ్వాస ఆగకపోవడం వంటి గుండె సమస్యల్ని తగ్గిస్తుందట.

దీంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి ఇతర సమస్యలు తగ్గుతాయట. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వల్ల రక్తపోటుని తగ్గిస్తుందట. దీంతోపాటు కొలెస్ట్రాల్ లెవల్స్ మెరుగ్గా మారతాయట. బరువుని మెంటెయిన్ చేయడానికి ఈ వాకింగ్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయట. అయితే ఒకేసారి ఎక్కువగా వాకింగ్ చేయకూడదు. మొదట నెమ్మదిగా మొదలుపెట్టి ఆ తర్వాత రోజురోజుకీ వాకింగ్ సమయాన్ని పెంచుకుంటూ పోవాలని చెబుతున్నారు. మీ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైద్యులు సలహా మేరకు మాత్రమే వాకింగ్ చేస్తే మంచిదని చెబుతున్నారు. వాకింగ్ చేసినప్పుడు ఛాతిలో నొప్పి ఆయాసం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తే వెంటనే ఆగి ఒకచోట కూర్చోవాలని చెబుతున్నారు. లేదంటే సమీపంలోని డాక్టర్ని కలవడం మంచిదని చెబుతున్నారు..

Exit mobile version