Barefoot Benefits : ఇంట్లో నుంచి బయటికెళ్తేనే కాదు.. ఇంటి లోపల కూడా చెప్పులేసుకుని తిరిగేస్తున్నాం. పిల్లలు ఆడుకోడానికి వెళ్లేటపుడు కూడా చెప్పులు వేసే పంపిస్తాం. మనకు కావలసిన నిత్యవసరాలలో చెప్పులు కూడా భాగమైపోయాయి. మన పూర్వీకుల జీవనశైలి ఇందుకు భిన్నంగా ఉండేది. నిజానికి వాళ్లు చెప్పులు లేకుండానే తిరిగేవారు. అలా నడిచిన రోజుల్లోనే వారు ఎంతో ఆరోగ్యంగా జీవించారు. ఇదే మాట ఇప్పుడు మన వైద్యులు కూడా చెబుతున్నారు. ఒకరోజులో కనీసం ఒక గంటసేపైనా చెప్పులేకుండా నడిస్తే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
– రోజులో ఒక గంట చెప్పులు లేకుండా నడిస్తే.. శరీర బరువంతా పాదాలపై సమానంగా పడుతుంది. పలితంగా శరీర భంగిమలో ఎలాంటి తేడా రాదు.
– అలాగే చెప్పులులేకుండా నడిచేటపుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం కాబట్టి.. మనలో సహనం పెరుగుతుంది.
– శరీరంలోని నాడుల కొనలన్నీ పాదంలో ఉంటాయి. చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడిస్తే నాడుల కొనల్లో చైతన్యం వచ్చి..మరింత చురుగ్గా పనిచేస్తాయి.
– అంతేకాదు.. గుండు కొట్టుకునే వేగం, రక్తంలో షుగర్ లెవల్స్, మెదడులో నాడీకణాల పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా నిద్రకూడా బాగా పడుతుంది.
– చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదం పూర్తిగా భూమిని తాకుతుంది. భూమి అయస్కాంత శక్తి ప్రభావం శరీరం మీద పడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి. రక్తప్రసరణ పెరిగి రక్తం పలుచగా ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
– ఒక గంటసేపు కాళ్లకు చెప్పుల్లేకుండా నడిస్తే.. శరీర కదలికల్లో బ్యాలెన్స్ పెరగడంతో పాటు మోకాలి కింది భాగంలో ఉన్న కండరాలు బలపడుతాయి. ఎత్తుఎక్కువగా ఉన్న చెప్పులు వేసుకుని నడిచే వారికి వెన్నుపై పడే ఒత్తిడి దూరమవుతుంది.
– చెప్పులు లేకుండా నడవడం కష్టమే అయినా.. నిదానంగా అలవాటు చేసుకుంటే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. పచ్చనిగడ్డి, సముద్రతీరంలో మెత్తని ఇసుకపై నడిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలుంటాయి.
Also Read : Skin Cancer Treatment : స్కిన్ క్యాన్సర్ కు సబ్బుతో ట్రీట్మెంట్.. 9వ తరగతి విద్యార్థి ఆవిష్కరణ