Site icon HashtagU Telugu

Stool/Poop: మలం రంగు మారిందా? దుర్వాసన పెరిగిందా?

Is The Stool Discolored Has The Stench Increased

Is The Stool Discolored Has The Stench Increased

మలంలో (Stool) దుర్వాసన రావడం సహజం. అయితే ఈ దుర్వాసన బాగా పెరిగిందా? మలం రంగు మారిందా? మలంలో రక్తం ఉందా? పొట్టలో గడబిడ, అజీర్తి, కడుపు ఉబ్బరం ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ లక్షణాలతో పాటు ఆరోగ్యం కూడా బాగా ఉండటం లేదా? అయితే సందేహించండి. వైద్యుణ్ణి సంప్రదించండి.

మల (Stool) పరీక్షలో..

మలం వ్యర్థ పదార్థమే కావొచ్చు. ఆ వ్యర్థ పదార్థాన్ని పరీక్షించడం ద్వారా మీకున్న అనారోగ్యాన్ని సులువుగా అంచనా వేయవచ్చని గుర్తుంచుకోండి. ఈ పరీక్షలో మలం రంగు, స్థితి, పరిమాణం, వాసన, మ్యూకస్‌, మలంలో రక్తం ఉందా? కొవ్వు, చక్కెర, ఆహారపు తునకలు, మాంసాహార అవశేషాలు, తెల్లరక్తకణాలు ఎలా ఉన్నాయో పరీక్షిస్తారు.   మల పరీక్ష సాయంతో మీ జీర్ణాశయంలో తలెత్తిన సమస్యను అంచనా వేస్తారు.  కాలేయం, క్లోమగ్రంథి, ఎంజైమ్‌ల పనితీరును తెలుసుకుంటారు.పొట్టలోని నులి పురుగులు, రోటా వైరస్‌, పెద్దపేగులోని క్యాన్సర్‌ ఆనవాళ్లు కూడా బయట పడతాయి.

మలంలో (Stool) ఈ తేడాలు ఉంటే..

మలంలో (Stool) పీహెచ్‌ పరిమాణం 7-7.5, షుగర్‌ 0.25 శాతం, కొవ్వులు 2-7 గ్రాముల వరకు ఉంటాయి. ఇందుకు భిన్నంగా మలం కనిపిస్తే మన జీర్ణవ్యవస్థలో ఏదో గడబిడ ఉందని భావించాలి. పీహెచ్‌ 7 కంటే తక్కువగా ఉంటే పోషకాహార లోపం ఉన్నట్టే. పీహెచ్‌ ఎక్కువగా ఉంటే పేగుపూత ఉందని తెలుసుకోవచ్చు.

వాసనను డిసైడ్ చేసేది అదే

  1. మలం యొక్క సాధారణ వాసన మీ జీర్ణాశయ పెద్ద పేగుల్లోని గట్ బ్యాక్టీరియాపై ఆధారపడి ఉంటుంది. అంటే.. మీరు కలిగి ఉన్న బ్యాక్టీరియా.. ఆహారాన్ని ఎలా పులియబెట్టింది అనే దాని ఆధారంగా వాసన డిసైడ్ అవుతుంది.
  2. అతిగా దుర్వాసన ఉండటాన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతంగా భావించవచ్చు.
  3. వెల్లుల్లి, ఉల్లిపాయలలో సల్ఫేట్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటితో కూడిన ఫుడ్ ఎక్కువగా తింటే మలంలో దుర్వాసన పెరుగుతుంది.
  4. బచ్చలి కూర, పాల ఉత్పత్తులు, మాంసం, ఆల్కహాల్ వల్ల కూడా మలంలో దుర్వాసన పెరుగుతుంది.
  5. మీరు తినే ఆహారం నుంచి సరైన మొత్తంలో పోషకాలను శరీరం గ్రహించలేనప్పుడు కూడా మలంలో దుర్వాసన పెరుగుతుంది.
  6. ఆహారం నుంచి పోషకాలను గ్రహించకుండా ప్రేగులను నిరోధించే ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ఉన్నప్పుడు కూడా మలంలో దుర్వాసన పెరుగుతుంది.
  7. ఉదరకుహర వ్యాధి వల్ల మనం తినే ప్రోటీన్ ఫుడ్ లోని గ్లూటెన్‌ రియాక్షన్ ను కలిగిస్తుంది. ఇది చిన్న ప్రేగు యొక్క లైనింగ్‌ను దెబ్బతీస్తుంది. ఫుడ్స్ లోని పోషకాల శోషణను నిరోధిస్తుంది. దీనివల్ల కూడా మలంలో దుర్వాసన పెరుగుతుంది.
  8. కార్బోహైడ్రేట్ అసహనం కూడా మలంలో దుర్వాసనను పెంచుతుంది. ఈ ప్రాబ్లమ్ వల్ల చక్కెరలు, పిండి పదార్ధాలను పూర్తిగా ప్రాసెస్ చేయడంలో జీర్ణ వ్యవస్థ విఫలం అవుతుంది.

నలుపు రంగు.. ఎరుపు రంగు మలం (Stool)

  1. ఐర‌న్ ట్యాబ్లెట్లు వేసుకునే వారికి, ఆయుర్వేద మందుల‌ను మింగే వారికి కూడా స‌హ‌జంగానే మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. కానీ ఈ విధంగా చేయ‌ని వారికి మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుందంటే అనుమానించాల్సిందే.
  2. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో పై భాగంలో, లోప‌ల ర‌క్త‌స్రావం అవుతున్నా లేదా అల్స‌ర్లు తీవ్రంగా ఉన్నా, గ్యాస్ట్రైటిస్ స‌మ‌స్య వంటి కార‌ణాల వ‌ల్ల మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది. అలాగే జీర్ణ ర‌సాల‌తో ర‌క్తం క‌లిసినా మ‌లం న‌లుపు రంగులో వ‌స్తుంది.
  3. చిన్న పేగుల్లో ర‌క్త స‌ర‌ఫ‌రా త‌గ్గిపోవ‌డం, ర‌క్త‌నాళాలు ఆకృతిని కోల్పోవ‌డం, పేగుల్లోని ర‌క్త నాళాల్లో స‌మ‌స్య‌లు వంటి కార‌ణాల వ‌ల్ల కూడా మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది.
  4. శ‌రీరంలో క్యాన్స‌ర్లు లేదా ట్యూమ‌ర్లు ఏర్ప‌డినా కొంద‌రికి మ‌లం న‌ల్ల రంగులో వ‌స్తుంది.
  5. ఎరుపు రంగులో మ‌లం వ‌స్తుంటే దాన్ని కూడా తీవ్ర‌మైన స‌మ‌స్య‌గానే భావించాలి.
  6. మ‌లం రంగులో మార్పులు వస్తే.. డాక్ట‌ర్లు ఎంఆర్ఐ, ఎక్స్ రేలు, సీటీ స్కాన్స్, గ్యాస్ట్రో స్కోపీ, కొల‌నోస్కోపీ వంటి ప‌రీక్ష‌లు చేసి స‌మస్య‌ను నిర్దారిస్తారు. అందుకు అనుగుణంగా మందుల‌ను ఇస్తారు.

Also Read:  Turmeric: పచ్చి పసుపు మరియు పసుపు పొడి మధ్య వ్యత్యాసం – మీకు ఏది మంచిది?