Site icon HashtagU Telugu

Bad Breath: ఏమి చేసిన నోటి దుర్వాసన పోవడం లేదా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Bad Breath

Bad Breath

మామూలుగా చాలా మందికి నోటి దుర్వాసన సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉదయం సాయంత్రం పళ్ళు శుభ్రం చేసుకున్నప్పటికీ కొన్ని రకాల కారణాల వల్ల నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ నోటి దుర్వాసన కారణంగా నలుగురితో మాట్లాడాలి అన్నా నలుగురులోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది పక్క వారికి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ నోటి దుర్వాసన నుంచి బయటపడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చట.

మరి నోటి దుర్వాసనను దూరం చేసే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నోటి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం సరిగా బ్రష్ చేయకపోవడం. డయాబెటిస్, జీర్ణ కోశ వ్యాధులు, శ్వాస కోశ వ్యాధులు ఉన్నవారిలో కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి నోటి దుర్వాసన విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదని చెబుతున్నారు. ఇలా నోటి దుర్వాసనతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకునే ముందు కచ్చితంగా బ్రష్ చేసుకోవాలని చెబుతున్నారు. చిగుళ్ల ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్న పసుపు, ఉప్పు మిశ్రమం కలిపిన నీళ్లతో నోటిని శుభ్రం చేసుకోవాలట.

అలాగే నోరు, గొంతు, నాలుక పొడి బారిన నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి ప్రతి రెండు గంటలకు ఒకసారి తప్పనిసరిగా గ్లాసు మంచినీళ్లు తాగడం మంచిదని,దీనివల్ల శరీరానికి తగిన నీరు అందడంతో పాటు నోటు దుర్వాసన సమస్య కూడా దూరమవుతుందట. మన ఆహార పదార్థంలో ఎక్కువగా విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో మంచిది. భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా నోరు పుక్కిలించడం కూడా చాలా అవసరం. మిరియాల పొడి, పసుపు, ఉప్పు, నువ్వుల నూనె మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేసి ప్రతిరోజు పళ్లు తోమితే చిగుళ్ల సమస్యలు తొలగి నోటి దుర్వాసన తగ్గిపోతుందట. అలాగే యాలకులను వేసుకుని నమలడం అలవాటు చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటుగా నోటి దుర్వాసన సమస్య కూడా దూరం అవుతుందట.