Honey Purity Check : తేనె ప్యూరిటీని ఇలా ఇంట్లోనే చెక్ చేయండి

Honey Purity Check : తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో ఫైట్ చేస్తాయి.

Published By: HashtagU Telugu Desk
Honey Business

Honey

Honey Purity Check : తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌తో ఫైట్ చేస్తాయి. ఊబకాయం, నిద్ర రుగ్మతలు, శ్వాస సమస్యలతో గురక వస్తుంటుంది. తేనె మన నాసికా రంధ్రాలను తెరుస్తుంది. గాలి స్వేచ్ఛగా పీల్చేందుకు ఉపయోగపడుతుంది. అందుచేత తేనెను తరచుగా తీసుకోవాలి. తేనే మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  ప్యూర్ తేనెకు, కల్తీ తేనెకు చాలా తేడాలు ఉన్నాయి. కల్తీ తేనెను మనం ఇంట్లోనే ఎలా గుర్తించాలి ?  అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

  • వాటర్ డిసోల్యూషన్ టెస్ట్ లో భాగంగా ఒక గ్లాసు నీటిలో టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఆ తేనె స్వచ్ఛమైనదైతే. నీటిలో సులభంగా కరగదు. గ్లాసు అడుగున పేరుకుపోతుంది. మీ తేనె నీటిలో కరిగిపోతే.. అది కల్తీది.
  • పేపర్ టవల్ టెస్ట్‌ లో భాగంగా ఒక పేపర్ టవల్ షీట్‌ పై తేనె వేయండి. అది స్వచ్ఛంగా ఉంటే.. పేపర్‌ టవల్‌ షీట్‌ దాన్ని త్వరగా పీల్చుకోలేదు. ఒకవేళ పేపర్‌ టవల్ షీట్‌ తేనెను పీల్చుకుంటే అది కల్తీది.
  • హీట్‌ టెస్ట్‌ లో భాగంగా కొంచెం తేనెను వేడి చేయండి. అది స్వచ్ఛమైన తేనె అయితే కారామెలైజ్ అవుతుంది. బంగారం రంగులోకి మారిపోతుంది. మంచి వాసన వస్తుంది. ఒకవేళ తేనె కల్తీదైతే.. కాలిపోతుంది, కాలిన వాసన వస్తుంది.
  • తేనె రంగు ఆధారంగా దాని క్వాలిటీపై ఒక నిర్ణయానికి రావచ్చు. స్వచ్ఛమైన తేనె బంగారం, కాషాయం రంగులో ఉంటుంది. తేనె వచ్చే మూలాన్ని బట్టి రంగు మారొచ్చు. తేనె లేత రంగులో ఉంటే.. దానిలో నీరు, స్వీటెనర్లు కలిపారని అర్థం.
  • తేనె ఎప్పటికీ స్ఫటికలుగా మారకుండా, ద్రవ స్థితిలోనే ఉంటే.. అది ఉత్పత్తి సమయంలో అధిక వేడి, ప్రాసెసింగ్‌కు గురైందని అర్థం. ఇలా జరిగి ఉంటే తేనెలోని సహజ ఎంజైమ్‌లు, కణాలు నశించిపోయి ఉంటాయి.
  • వెనిగర్‌ టెస్టులో భాగంగా తేనెలో వెనిగర్‌ వేయాలి. అందులో నురుగు వస్తే కల్తీ అయిందని (Honey Purity Check)  అర్థం.

Also read : Why A.P. Needs Jagan : మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలి..?

  Last Updated: 09 Oct 2023, 02:35 PM IST