Site icon HashtagU Telugu

Putnala Pappu: వామ్మో పుట్నాల పప్పుతో ఏకంగా ఎన్ని రకాల ప్రయోజనాలా.. బరువు తగ్గడంతో పాటు మరెన్నో లాభాలు!

Putnala Pappu

Putnala Pappu

శనగల్ని వేయించి పుట్నాలని తయారు చేస్తారు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఈ పుట్నాల పప్పుని కొన్ని కొన్ని ప్రదేశాలలో పప్పులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలని అందిస్తాయట. తక్కువ కేలరీలు కూడా ఉంటాయి. వీటిని స్నాక్స్‌ లా చాలా మంది తింటారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుందట. అధిక బరువుతో బాధపడేవారు వేయించిన శనగలు తింటే ఆ సమస్య చాలా వరకూ తగ్గుతుందట.

పుట్నాల పప్పులో ఎక్కువగా పాస్ఫరస్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్ అవుతుందట. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎక్కువగా పాస్ఫరస్ తీసుకుంటే మీ బాడీలో రక్తపోటు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది. బాడీలో జరిగే జీవ ప్రక్రియలలో పాస్ఫరస్ ముఖ్య పాత్ర పోషిస్తుందట. పుట్నాల పప్పు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయట. దీంతోపాటు అనేక సమస్యలు దూరమవుతాయట. అయితే రెగ్యులర్‌ గా తింటే ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు దూరమవుతాయని అందుకోసం వీటిని ఎలా అయినా తీసుకోవచ్చని చెబుతున్నారు. ఈ పుట్నాల పప్పులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది.

ఇది పవర్‌ఫుల్ ఆక్సీకరణ కారకం. దీనిని తీసుకోవడం వల్ల DNA నష్టం తగ్గుతుందట. ఇమ్యూనిటీ బలంగా మారేందుకు సెలీనియం కీ రోల్ పోషిస్తుందట. అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. ఈ పుట్నాలపప్పు షుగర్ ఉన్నవారికి చాలా మంచిదట. ఇది గ్లూకోజ్ హెచ్చు తగ్గుల్ని సరిచేస్తుందట. షుగర్ లెవల్స్ ఒక్కసారిగా తగ్గకుండా చూస్తుందట. ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకునేలా చేస్తుందని చెబుతున్నారు.
పుట్నాల పప్పులో మాంగనీస్, ఫోలేట్, ఫాస్పరస్, రాగి వంటి పోషకాలు ఉంటాయట. ఇవన్నీ గుండె జబ్బుల్ని దూరం చేస్తాయట. వీటిని తరచుగా తింటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గేందుకు హెల్ప్ చేస్తుందట..

Exit mobile version