Dry Skin: డ్రై స్కిన్ కు పెట్రోలియం జెల్లీ మంచిదా? కొబ్బరి నూనె మంచిదా?

డ్రై స్కిన్ ప్రాబ్లమ్ చాలామందికి ఉంటుంది. పొడి చర్మానికి కొబ్బరి నూనె మంచిదా?

డ్రై స్కిన్ (Dry Skin) ప్రాబ్లమ్ చాలామందికి ఉంటుంది. పొడి చర్మానికి కొబ్బరి నూనె మంచిదా? పెట్రోలియం జెల్లీ మంచిదా? అనే సందేహం ఎంతోమందికి కలుగుతుంటుంది. ఏది కొనాలో అర్ధం కాక కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఈవిషయంలో వైద్య నిపుణుల సూచన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

మనం పెట్రోలియం జెల్లీని తాకినప్పుడు.. అది జెల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చమురు శుద్ధి యొక్క ఉప ఉత్పత్తి. అందుకే అది జెల్ లా ఉంటుంది. దానివల్ల ఇది పర్యావరణ అనుకూలమైనది కాకపోవచ్చు. ఇక కొబ్బరి నూనె పూర్తిగా సహజమైంది. కొబ్బరి నూనెను ఎండిన కొబ్బరి నుంచి తీస్తారు. కొబ్బరి నుంచి నూనెను తీశాక దాన్ని ప్రాసెసింగ్ చేస్తారు. ఫలితంగా అది క్లీన్ లుక్ లోకి మారుతుంది. అయితే ఈ ప్రాసెసింగ్ పద్ధతిలో కొబ్బరి నూనె కంపెనీలు ఏ పద్ధతులు ఫాలో అవుతాయి?

ఏవైనా కెమికల్స్ వాడుతాయా? అనే దాని ఆధారంగా కొబ్బరి నూనె ఫ్యూరిటీ ఉంటుంది. అందుకే డ్రై స్కిన్ (Dry Skin) ఉన్నవాళ్లకు బెస్ట్ ఛాయిస్ కొబ్బరి నూనె. దీన్ని మీ శరీరమంతా పూయడం వల్ల సహజంగా మీ చర్మానికి తేమ లభిస్తుంది. ఇది మీ జీవక్రియను కూడా పెంచుతుంది. కాబట్టి పెట్రోలియం జెల్లీ కంటే కొబ్బరినూనెకు ప్రాధాన్యత ఇవ్వడమే బెస్ట్.

పెట్రోలియం జెల్లీ ప్రయోజనాలు

పెట్రోలియం జెల్లీ తరచుగా డీహైడ్రేట్ అయిన ఏదైనా చికిత్సలో సహాయం చేయడానికి సమయోచితంగా వాడొచ్చు. పగిలిన పెదవులు, పొరలుగా ఉండే స్కిన్, డైపర్ రాష్, మోచేతులు, మోకాలు వంటి ప్రాంతాలకు పెట్రోలియం జెల్లీ పెట్టుకోవచ్చు. ఇది ఆయా భాగాలకు తేమను జోడించడంలో సహాయపడుతుంది.

ఇది మాయిశ్చరైజర్ కాదు

మినరల్ ఆయిల్ , పెట్రోలియం జెల్లీ నిజంగా మాయిశ్చరైజర్లు కాదని వైద్య నిపుణులు అంటున్నారు. ఇవి చర్మం నుంచి తేమ బయటకు రాకుండా అడ్డంకిగా మాత్రమే పనిచేస్తాయని చెబుతున్నారు.

నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు..

పెట్రోలియం జెల్లీ మీ ముఖంపై ముడుతలకు కారణం కావచ్చు. మొటిమలు ఉన్నవారు ముఖంపై పెట్రోలియం జెల్లీ పెట్టొద్దు. ఆ మొటిమల రంధ్రాలను పెట్రోలియం జెల్లీ మూసివేసే అవకాశం ఉంటుంది.ఇది నెగెటివ్ ఎఫెక్ట్. మీ ముఖానికి తేమ కావాలంటే కొబ్బరి నూనెను వాడండి. పెట్రోలియం జెల్లీ వద్దు.

పెట్రోలియం జెల్లీకి సహజ ప్రత్యామ్నాయాలు

డ్రై స్కిన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్లు మినరల్ ఆయిల్, పారాఫిన్ వ్యాక్స్, పెట్రోలేటం, నాఫ్తా, ఫార్మాల్డిహైడ్ వంటి పెట్రోలియం ఉప ఉత్పత్తులను వాడొద్దు.  కోకో, షియా బటర్, కొబ్బరి నూనె తో తయారు చేసిన ఉత్పత్తులను వాడొచ్చు. దీంతో మీ చర్మం సహజంగా తేమగా ఉంటుంది. తగినంత హైడ్రేట్ అవుతుంది.

బెస్ట్ మాయిశ్చరైజర్‌ కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో లినోలిక్ యాసిడ్ , లారిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. చర్మాన్ని మృదువుగా చేయడానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలోని విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ మీ చర్మానికి బాగా హెల్ప్ చేస్తాయి.

Also Read:  Baldness Tips: బట్టతలకు, జుట్టు రాలే ప్రాబ్లమ్ కు ఇంటి చిట్కాలు