Site icon HashtagU Telugu

Ivy Gourd: దొండకాయ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

Mixcollage 23 Jul 2024 04 04 Pm 7441

Mixcollage 23 Jul 2024 04 04 Pm 7441

మన వంటింట్లో దొరికే కాయగూరలలో దొండకాయ కూడా ఒకటి. దొండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దొండకాయతో రకరకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరు దొండకాయను తెగ ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ దొండకాయలు వేసవి కాలంలో మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దొండకాయల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మరి దొండకాయ తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దొండకాయ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో తినడం వల్ల వీరికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ఎందుకంటే దొండకాయను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట. ఈ కూరగాయ యాంటీ హైపర్గ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉంటుందని, ఇవి డయాబెటిస్ ను నిర్వహించడానికి సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కూరగాయలో కార్బోహైడ్రేట్ పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి కూరగాయను తినడం వల్ల కడుపు తొందరగా నిండుతుందట. తొందరగా ఆకలి వేయదు. దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా పెరగకుండా కాపాడుతుందట.

మాములుగా మగవారికంటే ఆడవారే ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారికి దొండకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ కూరగాయలో మంచి మొత్తంలో ఇనుము ఉంటుందటం ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. దొండకాయలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుందట. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని ఎన్నో రోగాలకు, సంక్రమణలకు దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.