Site icon HashtagU Telugu

Head Bath: ప్రతీ రోజూ తల స్నానం చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Head Bath

Head Bath

మామూలుగా చాలా మందికి రోజూ స్నానం చేసే అలవాటు ఉంటుంది. కొందరు తలస్నానం చేస్తే కొందరు మామూలు స్నానం చేస్తూ ఉంటారు. కొందరు రెండు పూటలా తలస్నానం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలం వచ్చింది అంటే రోజుకు రెండుసార్లు మూడుసార్లు కూడా స్నానం చేస్తూ ఉంటారు. అయితే రోజు తల స్నానం చేయవచ్చా అలా చేస్తే ఏమైనా జరుగుతుందా ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పనులకు, కాలేజీలకు, ఆఫీలకు వెళ్లేవారు చాలా మంది ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేస్తుంటారు. కానీ దీనివల్ల మీ జుట్టుకు ఉన్న సహజ నూనెలు తొలగిపోతాయట.

దీనివల్ల మీ వెంట్రుకలు పొడిబారుతాయట. అందుకే ప్రతి రోజు తల స్నానం చేయాలి అనుకుంటే సల్ఫేట్ లేని షాంపూను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. అలాగే వేడి వేడి నీటితో కూడా తలస్నానం చేయకూడదట. కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. అలాగే ప్రతిరోజు గాడత ఎక్కువ ఉండే షాంపులను ఉపయోగించి తల స్నానం చేయడం అసలు మంచిది కాదు. అలాగే జుట్టు చివర్లను ఎప్పుడూ గట్టి గట్టిగా రుద్దకూడదట. జుట్టు తొందరగా ఆరడం కోసం డ్రైయ్యర్ ను వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. జుట్టు సహజంగా ఆలేలా చూడాలట. మీ జుట్టు హెల్తీగా ఉండాలంటే రోజువారీ జుట్టు సంరక్షణ చాలా అవసరం అని చెబుతున్నారు.

అలాగే జుట్టుకు నూనె పెట్టాలట. అప్పుడే మీ జుట్టుకు మంచి పోషణ అందుతుందని, జిడ్డుగా మారితే తప్ప రోజూ తలస్నానం చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. అయితే ప్రతి రోజూ షాంపూతో తలస్నానం చేయడం వల్ల మీ జుట్టు స్పష్టంగా కనిపిస్తుందట. కానీ ఇది కాలక్రమేనా మీ జుట్టును పొడిబారేలా చేస్తుందట. అలాగే చిక్కులు ఎక్కువగా పట్టి జుట్టు చివర్లో, అంతేకాదు మీ జుట్టు జీవం లేనట్టుగా, నూనె లేనట్టుగా కనిపిస్తుందట. జుట్టును రోజూ వాష్ చేయడం వల్ల వెంట్రుకలు దాని సహజ రంగును, ప్రకాశాన్ని కోల్పోతాయట. ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల నల్ల వెంట్రుకలు సహజ రంగుని కోల్పోయి ఎర్రగా మారి కాస్త అందవిహీనంగా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మీకు ఎలాంటి జుట్టు ఉన్నా వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం చేయడం మంచిదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టులో నేచురల్ ఆయిల్స్ ఉంటాయట. దీనివల్ల మీ జుట్టు పొడిబారే అవకాశం ఉండదని చెబుతున్నారు. అలాగే జిడ్డుగా కూడా మారదట. పొడిజుట్టు లేదా కర్లీ జుట్టు జుట్టు తేమను నిలుపుకోవటానికి తక్కువగా తరచుగా శుభ్రపరచడం ప్రయోజనకరంగా ఉంటుందట. అలాగే ఆయిలీ జుట్టును రోజూ వాష్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.