మామూలుగా మనలో చాలామంది టాబ్లెట్లను ఎప్పుడు వేసుకోవాలో తెలియక ఎలా పడితే అలా ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చిన జబ్బు పోవడం సంగతి పక్కన పెడితే చాలా రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. అందుకే వైద్యులు చెప్పిన సూచనలను మేరకు మాత్రమే టాబ్లెట్లను వినియోగించాలని చెబుతూ ఉంటారు. చాలామంది భోజనం చేసిన తర్వాత వేసుకోమని చెప్పగా భోజనం తిన్న వెంటనే క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మింగేస్తూ ఉంటారు. కొందరు రకరకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు రకరకాల టాబ్లెట్లను కలిపి ఒకేసారి వేసుకుంటూ ఉంటారు. కానీ అలా టాబ్లెట్ను కలిపి అస్సలు వేసుకోకూడదు.
వేర్వేరు వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మీరు ప్రతి మందును విడిగా, క్రమం తప్పకుండా తీసుకోవాలి. కానీ కొంతమంది ఒకే టైంలో వేర్వేరు మాత్రలను వేసుకుంటుంటారు. దీనివల్ల ట్యాబ్లెట్ల ప్రయోజనాలను పూర్తిగా గ్రహించే శరీర సామర్థ్యానికి ఆటంకం కలుగుతుంది. ఇది మందుల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను కూడా కలిగిస్తాయి. డాక్టర్ ను అడగకుండా, తగిన అవగాహన లేకుండా ఫార్మసీల నుంచి ట్యాబ్లెట్లను కొని వాడే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. సరైన ప్రిస్క్రిప్షన్ ఉన్న మందును మాత్రమే వాడాలి. లేదంటే ఎన్నో వ్యాధుల బారిన పడతారు. కొంతమంది నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మాత్రలను వేసుకుంటారు.
కానీ మందులను ఎక్కువగా తీసుకుంటే అలసట, మైకంతో పాటుగా కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. అందుకే మోతాదుకు మించి మందులను వాడకూడదు. వైద్యుల సలహా తీసుకోకుండా తలనొప్పి లేదా జీర్ణ సమస్యలు వంటి చిన్న చిన్న సమస్యలకు కూడా మందులను వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఊరికే మందులను వాడితే ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అలాగే ఎప్పుడూ కూడా భోజనం చేసిన వెంటనే మందులను వేసుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. పోషక శోషణను నిరోధిస్తుంది. మాత్రలు తీసుకోవడానికి ఖచ్చితమైన సమయాన్ని డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి. తిన్న తర్వాత కనీసం కొద్దిసేపు ఆగి ఆ తర్వాత టాబ్లెట్లను వేసుకోవడం మంచిది. లేదంటే చాలా రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
note : ఈ ఆరోగ్య సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.