మామూలుగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు సీజనల్ వ్యాధులు రావడం అన్నది సహజం. ఎక్కువగా సీజన్ చేంజ్ అయినప్పుడు కొంతమందికి దగ్గు జలుబు లాంటివి వస్తే మరి కొందరికి జ్వరం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే చాలామంది జ్వరం వచ్చినా కూడా అలాగే స్నానం చేస్తూ ఉంటారు. ఇంకొందరు మాత్రం అలా చేయకూడదని అలా జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే జ్వరం ఇంకా ఎక్కువ అవుతుందని అంటూ ఉంటారు. మరి నిజానికి జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవచ్చా చేయకూడదా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా జ్వరం, శరీర నొప్పి, తలనొప్పి, అలసట, నిద్రలేమి వైరల్ ఫీవర్ ప్రముఖ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి కారణంగా, శరీరం చాలా బలహీనంగా మారుతుంది. దాని ప్రభావం చాలా కాలం పాటు ఉండటంతోపాటు బరువును కూడా తగ్గిస్తుంది. వైరల్ ఫీవర్ సమయంలో స్నానం చేయాలా వద్దా? అయితే కొంతమంది వైద్యులు వైరల్ ఫీవర్ విషయంలో స్నానం చేయడం ఆరోగ్యకరమైన మార్గం అని చెబుతారు. ఎందుకంటే ఇది శరీరం నుంచి మురికిని తొలగిస్తుందని, మానసికంగా కూడా ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుందని చెబుతారు. అందువల్ల, అనేక సందర్భాల్లో, వైరల్ ఫివర్ ఉన్నప్పుడు స్నానం చేయడం సురక్షితంగా పరిగణిస్తారు.
పిల్లలకి లేదా వృద్ధులకు వైరల్ జ్వరం వస్తే, స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో, ప్రతి వ్యక్తి వైద్య పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మన శరీరం వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, అది మరింత అలసిపోకుండా కాపాడాలని వైద్యులు చెబుతారు. స్నానం చేసే సమయంలో లక్షణాలు పెరగవచ్చు. దీని కారణంగా రోగి మరింత అసౌకర్యానికి గురవుతాడట. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు స్నానం చేసే విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.