Corn: మధుమేహులు మొక్కజొన్న తినొచ్చా? ఎలా తింటే ఆరోగ్యానికి మేలు

మామూలుగా వర్షాకాలం మొదలైంది అంటే చాలు ఎక్కడ చూసినా కూడా ఆ మొక్కజొన్నలను కాల్చి లేదా ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు. చల్

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 10:00 PM IST

మామూలుగా వర్షాకాలం మొదలైంది అంటే చాలు ఎక్కడ చూసినా కూడా ఆ మొక్కజొన్నలను కాల్చి లేదా ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు. చల్లటి వాతావరణం లో ఈ మొక్కజొన్న తింటూ ఆస్వాదిస్తూ ఉంటారు. బాగా ఉడకబెట్టిన లేదా కాల్చిన మొక్కజొన్నకు కొంచెం ఉప్పు కారం వేసుకుని తింటే అంతకుమించిన అద్భుతమైన స్నాక్స్ మరొకటి ఉండదు అని చెప్పవచ్చు. అది మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అని కూడా చెప్పవచ్చు. అయితే మొక్కజొన్న నువ్వు మధుమేహం ఉన్నవారు తినవచ్చా? ఈ సందేహం చాలా మంది డయాబెటిస్ పేషెంట్లకు కలిగి ఉంటుంది.

మరి డయాబెటిస్ ఉన్నవారు మొక్కజొన్న తినవచ్చా తింటే ఎటువంటి ఫలితాలు కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొక్కజొన్నలు కనిపిస్తే తినకుండా అసలు ఆగలేరు. డయాబెటిస్ ఉన్నవారు ఉడికించిన మొక్కజొన్నలు తీసుకోవడం మంచిది. ఉడికించిన మొక్కజొన్న గ్లైసిమిక్ ఇండెక్స్ 52 ఉంటుంది. ఇది మనం తీసుకునే పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ని కలిగి ఉంటాయి. అందుకే ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల మధుమేహం ఉన్న వ్యక్తులు వీటిని తీసుకునే పరిమాణం మీద తప్పనిసరిగా దృష్టి పెట్టాలి.

తినవచ్చు కదా అని మరీ మితిమీరి తింటే మాత్రం సమస్యలు తప్పవు. మొక్కజొన్నలో డైటరీ ఫైబర్ మంచి మూలం. రక్తప్రవాహంలో కార్బోహైడ్రేట్ల శోషణని నెమ్మదించేలా చేస్తుంది. మెరుగైన ఇన్సులిన్ నిర్వహణకు సహాయపడుతుంది. మొక్కజొన్న గింజలు ప్రాసెస్ చేయని రూపంలో ఎంచుకోవడం ఉత్తమం. మొక్కజొన్న తయారీ విధానం కేలరీలు పెంచడం తగ్గించడం, చక్కెర స్థాయిల్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్యాక్ చేసిన మొక్కజొన్న తినడం లేదా చీజ్, తియ్యటి మొక్క తింటే కేలరీలు పెరుగుతాయి. ఇది అధిక కార్బ్, కొవ్వు పదార్థాల కారణంగా చక్కెర స్థాయిలని పెంచుతాయి. వీటి కంటే కాల్చిన తాజా మొక్కజొన్న కోబ్స్ తినడం మంచిది.