Fish Ice Cream: మాములుగా కొందరికి భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తినడం అలవాటు ఉంటుంది. అయితే ఇది కొన్ని సార్లు మంచిదే అయినా కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నప్పుడు పాల ఉత్పత్తులు తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెబుతున్నారు. ముఖ్యంగా మాంసాహారం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ అస్సలు తినకూడదట. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాంసాహార ప్రియులు ఎక్కువగా మటన్, చికెన్, చేపలను తినడానికి ఇష్టపడతారు. కానీ అదే సమయంలో చాలా మంది తిన్న తర్వాత స్వీట్లు లేదా చల్లని ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు. చేపలు తిన్న తర్వాత పాలు, టీ మొదలైనవి తాగకూడదట.
చేపలు తిన్న తర్వాత పాలు లేదా పాల ఉత్పత్తులతో పాటు చేపలు తినకూడదట. ఇలా తీసుకోవడం వల్ల కడుపు సమస్యలు అలాగే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని,కానీ మీరు చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినవచ్చని చెబుతున్నారు. ఇది కొంతమందికి జీర్ణ సమస్యలను కలిగిస్తుందట. ముఖ్యంగా మీకు నిర్దిష్ట అలెర్జీ సమస్య ఉంటే, ఐస్ క్రీమ్ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. చేపలు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి ముందు కొంత సమయం వేచి ఉండాలట. చేపలు తిన్న వెంటనే ఐస్ క్రీం తినడానికి బదులుగా, కనీసం ఒకటి నుండి ఒకటిన్నర గంటలు వేచి ఉండటానికి ప్రయత్నించాలట. తిన్న తర్వాత మీకు ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. మీకు ఏవైనా అలెర్జీలు లేదా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉంటే, రెండింటినీ కలిపి తినడం మానుకోవాలట.
లేదంటే చేపలు తిన్న తర్వాత పాల ఉత్పత్తుల జోలికి వెళ్లకపోవడమే మంచిదని, కాబట్టి ఐస్ క్రీమ్ తినకుండా ఉండటం ఎల్లప్పుడూ మంచిదని చెబుతున్నారు. కాగా చేపలు తిన్న తర్వాత పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం మానుకోవాలట. కొంతమంది పెరుగు లేదా పాలలో చేపలను వండుతారు. ఇది మంచిది కాదట. పాలు, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులతో చేపలు తినడం జీర్ణక్రియకు అంత మంచిది కాదని చెబుతున్నారు. సిట్రస్ పండ్లు అనగా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు. అయితే ఈ సిట్రస్ పండ్లు తిన్న తర్వాత చేపలు తినడం మానుకోవాలట. కొంతమంది సిట్రస్ పండ్లను సలాడ్లలో వేసి చేపలతో కలిపి తింటారు. చేపలు, సిట్రస్ పండ్ల కలయిక ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. నిమ్మకాయలు, నారింజ, టమోటాలు, కివీస్ వంటి సిట్రస్ పండ్లు ఆమ్లంగా ఉంటాయట. చేపలు ప్రోటీన్ ముఖ్యమైన మూలం. ఈ రెండు పదార్థాలు కలిసి వచ్చినప్పుడు, అవి కడుపు సమస్యలను కలిగిస్తాయట.
Fish Ice Cream: చేపలు తిన్న తర్వాత ఐస్‌క్రీమ్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Fish Ice Cream