పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరికి పెరుగు లేకపోతే ముద్ద కూడా దిగదు. రోజుకి కనీసం ఒక్కసారైనా పెరుగుతో తినాల్సిందే. ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ తిన్నప్పుడు చాలామంది పెరుగు పచ్చడి పెరుగు అన్నం వంటివి తింటూ ఉంటారు. ఇక ప్రస్తుతం సమ్మర్ కావడంతో ప్రతి ఒక్కరూ మజ్జిగ తాగడం లస్సీ తాగడం లేదంటే పెరుగు తినడం లాంటివి చేస్తూనే ఉంటారు. పెరుగు వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరడంతో పాటు అనేక సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. పెరుగు తినడం వల్ల మనకు వేడి చేయకుండా ఉంటుందట. శరీరం ఎఫ్పుడూ చల్లగా ఉంటుందని, తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమౌతుందని చెబుతున్నారు.
పెరుగు తినడం వల్ల మన ప్రేగులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట. ఇది జీవక్రియను మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుందట. శరీరంలో సమతుల్యతగా ఉంచడంలో సహాయపడుతుందట. అంతేకాకుండా దాహీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుందట. ఇది ఆరోగ్యకరమైన ప్రేగు కదలికను మరింత ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా సహాయపడుతుందని చెబుతున్నారు. పెరుగు తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చట. ఫైబర్ తో పాటు, ఇది ప్రోటీన్ తో నిండి ఉంటుందట. తక్కువ క్యాలరీ కంటెంట్ ని కలిగి ఉంటుందట. ప్రతిరోజూ పెరుగు తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుందని, దాంతో ఈజీగా బరువుతగ్గుతుందని చెబుతున్నారు.
ప్రోబయోటిక్ రిచ్ గా ఉండే పెరుగు మీ ప్రేగులకు గొప్పదని, ఇది పేగులోని మంచి బ్యాక్టీరియా మీ శరీరంలో రోగనిరోధక శక్తిని, సమతుల్యతను పెంపొందించడంలో మరింత సహాయపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్ లతో నిండి ఉంటుందని, ఇవి టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ను నివారించడంలో సహాయపడతాయట. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయట. మరింత పోషకమైన, మెరుస్తున్న చర్మానికి సహాయపడతాయట. అంతేకాకుండా ఇది చర్మం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.