Site icon HashtagU Telugu

Milk-Banana: పాలు,అరటిపండు కలిపి తింటున్నారా.. అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Milk Banana

Milk Banana

మామూలుగా చాలామంది పాలతో కలిపి కొన్ని రకాల పదార్థాలను తింటూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని ఫ్రూట్స్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. అందులో అరటిపండు కూడా ఒకటి. పంచామృతం రూపంలో, ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, బరువు పెరగాలనుకున్నవారు ఇలా చాలా సందర్భాలలో అరటిపండు పాలు కలిపి తింటూ ఉంటారు. కొందరు వ్యాయామానికి ముందు ఈ ఫుడ్ కాంబినేషన్ ఇష్టపడతారు. ఈ రెండింటిలో విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే ఈ రెండింటిని సూపర్ ఫుడ్స్ అంటారు నిపుణులు. మరి ఈ రెండు కలిపి తినడం మంచిదేనా అలా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ​అరటిపండులో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, బి6 ఉన్నాయి.

ఇక, పాలలో కూడా ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ లో ఈ ఫుడ్ కాంబినేషన్ సూపర్ అని చెబుతున్నారు. అరటిపండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. పాలలో చాలా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండు ఆరోగ్యకరమైన గట్ హెల్త్‌ కు సహాయపడతాయి. దీంతో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అరటిపండు లోని అమైలేస్ వంటి సహజ ఎంజైమ్‌ లు శరీరంలోని ఆహారాన్ని ప్రాసెస్ చేయడంలో ఎంతో బాగా సహాయపడతాయట. ఫలితంగా పాలతో పాటు అరటిపండును కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుందని, అంతేకాకుండా మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.

అరటిపండ్లు గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవి మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. పాలలోని ప్రోటీన్ కంటెంట్ కారణంగా శక్తి మరింత బూస్ట్ అవుతుందట. అందుకే వ్యాయామాలు చేసేవారికి ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెబుతున్నారు. వర్కౌట్స్ చేసే ముందు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం సూపర్ యాక్టివ్‌ గా ఉంటుందట. రోజంతా చాలా ఉత్సాహంగా, ఎనర్జీతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే అరటిపండులోని సహజ కార్బోహైడ్రేట్లు, పాలలోని ప్రొటీన్ కండరాల పెరుగుదలకు సాయపడతాయట. అరటిపండులో ఉండే అధిక పీచు పదార్థం మిమ్మల్ని ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. అదే పాలతో కలిపి తీసుకోవడం వల్ల మీకు ఆకలి త్వరగా వేయదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ ఆకలిని అదుపులో ఉంచుతుందట. ఈ రెండింటిని తినడం వల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గిపోతుందట. అయితే వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..

అరటిపండు పాలు కలిపిన కాంబినేషన్ ఎక్కువగా తీసుకుంటే గుండె, కాలేయానికి హానికరమట. ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఇప్పటికే అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఫుడ్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుందట. కొందరు అజీర్తి, అలెర్జీ సమస్యలతో బాధపడతారు. ఇలాంటి వారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలట. లాక్టోస్ అసహనం ఉన్నవారు వీటిని కలిపి తినడం వల్ల అతిసారం, వికారం, కడుపు తిమ్మిరి, బోటింగ్ వంటి సమస్యలు వస్తాయట. లాక్టోస్ అసహనం ఉన్నవారు పాలలోని చక్కెర లేదా లాక్టోస్‌ను పూర్తిగా జీర్ణించుకోలేరు. ఇక, అరటి పండులో కూడా చక్కెర ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు ఈ ఫుడ్ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలని చెబుతున్నారు..