Site icon HashtagU Telugu

Banana: ప్రతీ రోజు ఒక అరటిపండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 20 Jul 2024 05 13 Pm 5329

Mixcollage 20 Jul 2024 05 13 Pm 5329

మార్కెట్లో మనకు ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. అరటి పండ్లు మనకు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో లభిస్తూ ఉంటాయి. ఈ వీటిని చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. తరచూ అరటిపండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే ప్రతిరోజూ ఒక అరటిపండును తినడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

మరి రోజూ ఒక అరటిపండును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటిపండు ప్రీబయోటిక్స్ కు మంచి వనరు అని చెప్పవచ్చు. ఈ ప్రీబయోటిక్స్ మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది మన పేగులో ఉన్న మంచి బ్యాక్టీరియాను మరింత పెంచతుందట. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందట. అలాగే జీర్ణక్రియకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. కండరాలకు నరాలకు ఎంతో మేలు చేస్తుంది.

కండరాలు నరాలు తిమ్మిరితో బాధపడేవారు అరటిపండు తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అలాగే ఇందులో సోడియం పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఇకపోతే దీనిలో ఉండే పొటాషియం నరాల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఇందులో నిజం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.