పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మిగతా సీజన్లతో పోల్చుకుంటే సమ్మర్లో పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఆ పుచ్చకాయలు పుచ్చకాయ ముక్కలు అలాగే జ్యూస్లు వంటివి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇంట్లో లేదంటే బయట పుచ్చకాయ కోసినప్పుడు వాటి మీద ఉప్పు చల్లి ఇస్తుంటారు. ఒక రకమైన జీలకర్ర పొడి లాంటిది కలిపి ఇస్తూ ఉంటారు. అలా తిన్నప్పుడు కొంచెం ఉప్పుగా తీపిగా బాగుంటుంది. మరి పుచ్చకాయ మీద ఉప్పు చల్లుకొని తినవచ్చా తినకూడదా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ముక్కలపై కొద్దిగా ఉప్పు వేసి తినడం వల్ల పండ్ల ముక్కలు మరింత జ్యూసీగా, తియ్యగా ఉంటాయని చెబుతున్నారు. దీనికోసం ముందుగా పుచ్చకాయని కట్ చేసి కొద్ది ఉప్పు చల్లి ఆ తర్వాత తింటారు. పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల హైడ్రేట్ గా ఉండడమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుందట. ఈ పండులోని లైకోపీన్ అనే ఆరోగ్యకరమైన మూలకం చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందట. కాగా ఎండాకాలంలో పుచ్చకాయపై ఉప్పు వేస్తారు. దీనికోసం మీరు ఏ ఉప్పునైనా తీసుకోవచ్చు.
ముక్కలపై కాస్తా ఉప్పు చల్లి ఆ తర్వాత ముక్కల్ని తింటుంటే ముక్క ముక్కలో రుచి తెలుస్తుంది. ఈ పండులో అమైనో యాసిడ్ సిట్రులిన్ పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుందట. ముఖ్యంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యల్ని దూరం చేస్తుందట. అలాగే లైంగిక సమస్యల్ని తగ్గిస్తుందట. కాగా మనకి అనేక రకాల ఫ్లేవర్డ్ సాల్ట్ లు దొరుకుతాయి. వాటిని కూడా మీరు ట్రై చేయవచ్చు. వీటిని ట్రై చేయడం వల్ల మీరు మరింత టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారట. దీనికోసం నిమ్మ ఉప్పు కూడా వాడవచ్చట. నిమ్మరసం కూడా వాడవచ్చని చెబుతున్నారు. పుచ్చకాయ లోని విటమిన్ ఎ, సి కంటెంట్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుందట. దీని వల్ల మంచి ప్రకాశవంతమైన, అందమైన రంగుని ఇస్తుందట. విటమిన్ సి ఎక్కువగా ఉండే పుచ్చకాయని తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు. వర్కౌట్ తర్వాత తీసుకుంటే రక్తపోటు తగ్గడమే కాకుండా కండరాల వాపు కూడా తగ్గుతుందట. అలాగే గుండె జబ్బులు కూడా తగ్గుతాయని, బరువుని బ్యాలెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు.