Site icon HashtagU Telugu

Papaya: చిన్న బొప్పాయితో గుండె సమస్యలు, క్యాన్సర్ తోపాటు ఆ సమస్యలన్నీ దూరం.. కానీ ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందే!

Papaya

Papaya

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనకు బొప్పాయి ఏడాది మొత్తం లభిస్తూనే ఉంది. తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. బొప్పాయి గింజలు బొప్పాయి ఆకు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉపయోగపడేవే.
చాలామంది బొప్పాయిని ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. కానీ బొప్పాయి పండు ఉదయాన్నే తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ఉదయాన్నే బొప్పాయి పండు తినడం వల్ల కడుపులోని ట్యాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్లిపోతాయట. జీర్ణక్రియ పెరుగుతుందట. మలబద్ధకం కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

ఉదయాన్నే బొప్పాయి తింటే కడుపు మొత్తం క్లీన్ అవుతుందట. ఇది కడుపుని క్లీన్ చేస్తుందని, బొప్పాయి లోని ఎంజైమ్ అనే పపైన్ జీర్ణక్రియని సాఫీగా చేస్తుందని చెబుతున్నారు. మలబ్ధకం, అసిడిటీని కూడా తగ్గిస్తుందట. కాబట్టి, రెగ్యులర్‌గా తినడం మంచిదని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకున్న వారికీ బొప్పాయి ఎంతో మేలు చేస్తుందట. మరి ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలి అనుకున్న వారికి బొప్పాయి బాగా పనిచేస్తుందట. బొప్పాయిని ఉదయాన్నే తింటే దీని వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు ఉంటుంది. దీంతో కేలరీలను తక్కువగా తీసుకుంటారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుందట. దీంతో బరువు ఈజీగా తగ్గుతారట. బొప్పాయిలో ఫోలేట్, పొటాషియం, ఫైబర్‌లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, దీనిని తినడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయట.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వాపుని తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని, బొప్పాయి తినడం వల్ల లివర్ పనితీరు కూడా బాగుంటుందని చెబుతున్నారు. బొప్పాయిలో పొటాషియం, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండెకి చాలా మంచివని, వీటిని తరచుగా తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావని, ఇందులోని పోషకాలు కొలెస్ట్రాల్ లెవల్స్‌ ని తగ్గించి రక్తాన్ని సరిగా సప్లై అయ్యేలా చేస్తాయని,దీంతో హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయని చెబుతున్నారు. అలాగే బొప్పాయిని తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయట. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపీన్ అనే పదార్థాలు బాడీలో క్యాన్సర్ కారకాలు పెరగకుండా చేస్తాయట. దీనిని తినడం వల్ల ఆక్సిడేటివ్‌ ని స్ట్రెస్‌ ని తగ్గిస్తుందట. క్యాన్సర్ వచ్చే రిస్క్‌ ని తగ్గిస్తుందట. ఇది మహిళల ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గిన్నె నిండా బొప్పాయి తినాలట. తిన్న అరగంటకి మాత్రమే వేరే ఫుడ్ తినాలని లేదా తాగాలని ఉదయం టీ తాగే అలవాటు ఉంటే బొప్పాయి తిన్న వెంటనే తాగకూడదట. అరగంట తర్వాత తాగాలని చెబుతున్నారు. అలాగే పూర్తిగా పండిన బొప్పాయిని మాత్రమే తినాలని, పాలు, పెరుగు, పుల్లని పండ్లతో కలిపి అసలు తీసుకోకూడదని చెబుతున్నారు.