Site icon HashtagU Telugu

Health Tips: రాత్రిపూట పాలు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 18 Jul 2024 04 26 Pm 6213

Mixcollage 18 Jul 2024 04 26 Pm 6213

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు తాగడం వల్ల పాలలో ఉండే కాల్షియం ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం వల్ల ఎముకలు గట్టి పడతాయి. ఇకపోతే మనలో కొంతమంది ఉదయం పూట పాలు తాగితే మరి కొంతమంది రాత్రి పడుకునే ముందు పాలు తాగుతూ ఉంటారు. రాత్రి సమయంలో పాలు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందని చెబుతూ ఉంటారు. మరి నిజానికి రాత్రి సమయంలో పాలు తాగవచ్చా? తాగితే ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలలో ఉండే అమైనో ఆమ్లం ట్రిడోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుందట.

మెలటోనిన్, సెరోటోనిన్ అనే హార్మోన్లు మనకు నిద్రవచ్చేలా చేస్తాయనీ చెబుతున్నారు. అందుకే రాత్రిపూట పాలను తాగడం వల్ల బాగా నిద్ర పడుతుందట. అయితే ఇది అందరికీ వర్తిస్తుందా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటె కొందరికీ పాలు సమస్యలను కలిగిస్తాయి. కొన్ని రకాల ఆహారాలకు అలెర్జీ ఉన్నవారు రాత్రిపూట పాలను తిగితే అసౌకర్యంగా ఉంటుంది. ఇది వాళ్ల నిద్రను పూర్తిగా పాడు చేస్తుంది. కాబట్టి పాలు తాగితే అలర్జీలు జీర్ణ సమస్యలు వచ్చేవారు తాగకపోవడమే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజు రాత్రిపూట పాలు తాగడం వల్ల అందులో ఉండే పోషకాలు శిశువు ఎదుగుదలకు తోడ్పడతాయట. ఇక శరీరంలో ఉండే ప్రోటీన్లు కండరాలు ఎంజైంలు బలోపేతం అవుతాయని చెబుతున్నారు.

పాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే గోరువెచ్చని పాలు తాగడం వల్ల మీ బరువును పెరగకుండా కాపాడుతుందట. గోరువెచ్చని పాలు తాగినప్పుడు అది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దాంతో ఆకలి లేదు. తద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు వైద్యులు. రాత్రి పడుకునే ముందు పాలలో తేనె కలుపుకుని తాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుందట. పాలలో ఉండే క్యాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. పాలలో ప్రోటీన్, లాక్టియం పుష్కలంగా ఉంటాయట. ఇవి స్ట్రెస్ ను తగ్గిస్తాయి. అలాగే మీరు రాత్రిపూట విశ్రాంతి తీసుకుని హాయిగా నిద్రపోవడానికి సహాయపడతాయట. అదేవిధంగా రాత్రిపూట క్రమం తప్పకుండా పాలను తాగడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయట. అలాగే ఇవి మృత కణాలను కూడా తొలగిస్తాయట. పాలలోని ముఖ్యమైన పోషకాలు రోజంతా చురుకుగా ఉంచడానికి సహాయపడతాయనీ చెబుతున్నారు.