Site icon HashtagU Telugu

Pregnant Women: గర్భిణీ స్త్రీలు మటన్ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Pregnant Women

Pregnant Women

మాతృత్వం అనేది స్త్రీలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని చెప్పవచ్చు. పెళ్లి అయినా ప్రతి ఒక్క స్త్రీ ఏ మాతృత్వం కోసం ఎంతో తపిస్తూ ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతూ ఉంటుంది. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తల్లి అయ్యే భాగ్యం ఉండదు. ఇక ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్స్ చుట్టూ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే.. ప్రెగ్నెన్సీ గా ఉన్న సమయంలో స్త్రీలు అనేక రకాల జాగ్రత్తలు పాటించాలని తినే ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు.

తినే ఆహార పదార్థాల విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యులైన సలహా తీసుకోవడం మంచిదని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో మాంసాహారం కూడా ఒకటి. చాలామంది స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు మటన్ ఎక్కువగా తింటూ ఉంటారు. మరి గర్భిణీగా ఉన్నప్పుడు మటన్ తినవచ్చా?తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చికెన్ తక్కువగా తినడం మంచిది. చికెన్ సులభంగా జీర్ణం అవడంతో పాటు దీని నుంచి ప్రోటీన్ ని కూడా పొందవచ్చు. దీనివల్ల ఐరన్ లోపం కూడా పోతుంది. చికెన్ ను తినడం వల్ల తల్లి, బిడ్డకు ఇద్దరికీ అవసరమైన విటమిన్ బి 12, విటమిన్ ఎ, జింక్ వంటి పోషకాలు కూడా అందుతాయి.

అయితే గర్భిణులు మాంసా హారాన్ని చాలా జాగ్రత్తగా తినాలి. ఎందుకంటే వండని చికెన్ తినడం వల్ల బిడ్డకు హాని కలుగుతుంది. అలాగే గర్భం దాల్చిన మొదటి త్రైమాసికంలో గొడ్డు మాంసం లేదా మటన్ వంటి రెడ్ మీట్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది తల్లీ, బిడ్డ ఇద్దరికీ సురక్షితం కాదని వారు హెచ్చరిస్తున్నారు. రెడ్ మీట్ లో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ అతిగా తీసుకుంటే మాత్రం తల్లి, బిడ్డ ఇద్దరికీ హానికరం. ప్రెగ్నెన్సీ సమయంలో మటన్ ఎక్కువగా తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే మటన్ అత సులువుగా జీర్ణం కాదు. దీన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో స్త్రీ జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. దీనివల్ల కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. మటన్ ను శుభ్రం చేయకపోయినా, సరిగా ఉడికించకపోయినా ఫుడ్ పాయిజనింగ్ ముప్పు పెరుగుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ గర్భిణీ స్త్రీలు మటన్ తినాలి అనుకుంటే తాజాగా ఉన్న మటన్ తీసుకుని బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలని తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.