Site icon HashtagU Telugu

Alcohol: మందులో కూల్ డ్రింక్స్, సోడా కలుపుకొని తాగుతున్నారా.. అయితే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Alcohol

Alcohol

మామూలుగా మద్యం సేవించేటప్పుడు అందులో రకరకాల ఆ పదార్థాలు కలుపుకొని తాగుతూ ఉంటారు. కొంతమంది మద్యం మత్తులో రెండు మూడు రకాల బ్రాండ్లు కలుపుకొని తాగితే మరికొందరు పచ్చిగా అలాగే తాగిస్తూ ఉంటారు. ఇంకొంతమంది మద్యంలో కూల్ వాటర్, సోడా, కూల్ డ్రింక్స్ వంటివి కలుపుకొని తాగుతూ ఉంటారు. మామూలుగా మద్యం సేవించడం హానికరం అని తెలిసినా కూడా మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. దానికి తోడు వాటిలో సోడా వంటి పదార్థాలు కూడా కలుపుకొని తాగుతూ ఉంటారు. మరి ఇది ఆరోగ్యానికి మంచిదా కాదా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలా మందికి మందులో సోడా కలుపుకుని తాగే అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ లో సోడాను కలిపి తాగితే రుచి బాగుంటుందని అలా చేస్తుంటారు. కానీ ఈ రెండింటినీ మిక్స్ చేసి తాగితే ఎక్కువ మత్తు వస్తుందట. మందును నీటితో తాగే వారి కంటే వేగంగా మత్తు ఎక్కుతుంద. ఎందుకంటే సోడాలో కార్బోనేటేడ్ వాటర్, ఎక్కువ ఫ్రక్టోజ్, రంగులు, కెఫిన్, ఫాస్పోరిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లంలు ఎక్కువ మొత్తంలో ఉంటాయని, ఈ సోడాను ఎక్కువగా తాగితే మీకు ఊబకాయం నుంచి డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల వరకు ఎన్నో రోగాలు వస్తాయని చెబుతున్నారు. మందులు ఇతర లిక్విడ్స్ ని కలుపుకొని తాగడం కంటే నీళ్లు కలుపుకొని తాగడం మంచిదని చెబుతున్నారు.

గోరువెచ్చని నీరు తాగితే ఇంకా మంచిది అని చెబుతున్నారు. చాలా మంది కూల్ డ్రింక్స్ ను కూడా మందులో కలుపుకుని తాగుతుంటారు. కానీ అన్ని రకాల సోడా కార్బోనేటేడ్ పానీయాలు, శీతల పానీయాలలో భాస్వరం ఉంటుంది. విస్కీతో ఎక్కువ మొత్తంలో శీతల పానీయాలను తాగడం వల్ల మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోతుందట. అలాగే కొవ్వు కాలేయ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.