Pregnancy: గర్భిణులు ఎంత బరువు ఉండాలి? అపోహలు, వాస్తవాలు ఇవీ..!

ముఖ్యంగా గర్భ సమయంలో మహిళలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కొందరు ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొంతమంది ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు.

  • Written By:
  • Updated On - February 7, 2023 / 03:18 PM IST

ముఖ్యంగా గర్భ సమయంలో మహిళలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈ టైమ్‌లో పోషకాహారం తీసుకోవడం వల్ల వారికి పుట్టబోయే పిల్లల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ప్రెగ్నెన్సీ టైంలో కొందరు ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. కొంతమంది ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉంటారు. అసలు ఈ టైమ్‌లో ఎంతవరకు వెయిట్ పెరగొచ్చు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భంతో ఉన్న మొత్తం సమయంలో మహిళలు 8 నుంచి 10 కిలోల వరకు బరువు పెరగొచ్చు.ఇలా బరువు పెరగడం పుట్టబోయే పిల్లలు, మహిళలకు మంచిది. దీనికంటే తక్కువ బరువు ఉంటే ఆ ప్రభావం స్త్రీలు, పుట్టబోయే పిల్లలపై ఉంటుందని చెబుతున్నారు. నెలవారీగా ఎప్పటికప్పుడూ బరువును చెక్ చేసుకుంటూ ఉండాలని అంటున్నారు.

గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో మహిళలకు వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పచ్చళ్లు, సూప్స్, పండ్ల రసాలు తీసుకోవాలి. వాంతులు అవుతున్నాయి కదా అని కొంతమంది అసలు ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల నీరసం, మైకం రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

Also Read: Gold And Silver Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మొదటి 3 నెలలు బరువు పెరగకపోవచ్చు. దీనికి వాంతులు అవ్వడం ఓ కారణం అయితే, పిండం సరిగా ఎదగకపోవడం మరో కారణం కావొచ్చు. అయితే ఆ తర్వాత నుంచి కచ్చితంగా బరువు పెంచుకునే ప్రయత్నం చేయాలి. మొత్తం గర్బధారణ సమయంలో 10 నుంచి 12 కిలోల వరకూ బరువు పెరగొచ్చు.. అంతకు మించి మాత్రం బరువు పెరగడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. చిక్కుళ్లు, బెల్లం, పాలు, బీన్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పాలు, పెరుగు, చీజ్, పన్నీర్ వంటివి కాల్షియం కోసం తీసోకోవాలి. మాంసం, గుడ్లు వంటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కచ్చితంగా 2 గంటలకు ఓ సారి ఏదైనా ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా ఎక్కువగా నీరు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

బరువు విషయంలో ఇవి ఇంపార్టెంట్..

* ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచన ప్రకారం, గర్భం దాల్చే సమయానికి స్త్రీ కనీస బీఎంఐ 18.5 కేజీ/మీ. స్క్వేర్. ఉండాలి.

* అతి తక్కువ బరువు లేదా అధిక బరువు వల్ల పిండం ఎదుగుదల, కాన్పు వంటి విషయాల్లో అనుకోని ప్రమాదాలు పొంచి ఉంటాయి.

* బీఎంఐ 18.5 (తక్కువ బరువు) ఉండే స్త్రీలు 12.5 -18 కేజీలు బరువు పెరగొచ్చు.

* బీఎంఐ 18.5 – 24.9 (సరైన బరువు) ఉండే స్త్రీలు 11.5 -16 కేజీలు బరువు పెరగొచ్చు.

* బీఎంఐ 25 – 29.9 (అధిక బరువు) ఉండే స్త్రీలు 7 – 11.5 కేజీలు బరువు పెరగొచ్చు.

* బీఎంఐ 30 పైబడి (ఊబకాయం) ఉండే స్త్రీలు 5 – 9 కేజీలు బరువు పెరగొచ్చు.

* గర్భిణీ స్త్రీ ప్రతిరోజూ 300-500 అదనపు కేలరీలు, 15 గ్రాముల ప్రోటీన్లు, 10 గ్రాములవరకూ క్రొవ్వు పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.