Site icon HashtagU Telugu

Chaat: చాట్ ఆరోగ్యానికి మంచిదా?…లేక చెడు చేస్తుందా?డైటీషీయన్స్ ఏం చెబుతున్నారు..!!

Street Food

Street Food

చాట్ అనగానే చిన్న పెద్ద అందరికీ నోట్లో నీళ్లు ఊరడం సహజమే. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఈ స్ట్రీట్ ఫుడ్స్ ను తినేందుకు అందుకూ ఇష్టపడుతుంటారు. ఈ చాట్ వంటకాల్లో ముందుగా గుర్తొచ్చేది పానీ పూరీ. ఆ తర్వాత పావ్ బాజీ, కట్ లెట్ రగడా, పెరుగుతో చేసే చాట్ ఇలా వీటి లిస్ట్ బారెడు పొడుగు ఉంటుంది. కానీ చాట్ తినడం ఆరోగ్యకరమేనా, అనే సందేహం కలగక మానదు. నిజానికి స్ట్రీట్ ఫుడ్ ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయని డైటీషియన్స్ చెబుతుంటారు. ముఖ్యంగా చాట్ తయారీలో వాడే మంచి నీరు, అలాగే కూరగాయలు, ఇతర మసాలా నాణ్యత లేకపోతే అనేక జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా

అంతేకాదు కొన్ని చాట్ డిషెస్ లో అధిక కేలరీలు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. కానీ చాట్ డిషెస్ ఇంట్లో తయారు చేయడం ద్వారా మీరు ఆ పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకుంటారు. తద్వారా మీకు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు.

అయితే ప్రముఖ పోషకాహార నిపుణుడు భువన్ రస్తోగి తన తాజా పోస్ట్‌లో చాట్ డిషెస్ లో కూడా ఆరోగ్యకరమైనవి ఉన్నాయని నిరూపించారు. రస్తోగి సూచించిన కొన్ని ఆరోగ్యకరమైన చాట్ డిషెస్ ను మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు:

దహీ భల్లా
దహీ భల్లా అనేది పప్పు ఆధారితమైనది, దీనిని నూనె లో వేయించినప్పటికీ, నీటిలో నానబెట్టి, ఆ తర్వాత పెరుగులో ఉంచుతారు. పెరుగులో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. తద్వారా ఇదొక ఆరోగ్యకరమైన డిష్ గా మారుతుంది.

పాపడ్ చాట్
ఇందులో వేయించిన మైదా పిండి రొట్టె ఉంటుంది. దానిపై ఉడకబెట్టిన బఠాణీలు లేదా పెరుగు, ఇతర కూరగాయల సలాడ్స్ తో సర్వ్ చేస్తారు. ఇందులో పెరుగు వాడుతారు కాబట్టి, ప్రొటీన్ అధికంగా ఉండే అవకాశం ఉంది.

మూంగ్ చీలా
ఇది చాలా సమతుల్యమైనది, ప్రోటీన్‌తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది

మటర్ కుల్చా
కుల్చా మైదా ఆధారితమైనది. అలాగే ఇందులో ఉడికించిన బఠానీ వాడుతారు. ఇది అక్షరాలా జీరో ఆయిల్ ఫుడ్.

గోల్ గప్పే/పుచ్కా/పానీ పూరి
డైటింగ్ చేసే వారు వీటిని తినేందుకు ఎక్కువగా భయపడుతున్నారు. నిజానికి పానీ పూరీలు ఆరోగ్యానికి మంచివే. కానీ బయట అపరిశుభ్రమైన నీటిని వాడటం వల్ల జబ్బుల పాలవుతాము. అయితే ఇంట్లో తయారు చేసుకునే పానీ పూరీలోని నీటిలో యాంటీఆక్సిడెంట్ (పలచని పుదీనా చట్నీ) లక్షణాలు ఉంటాయి. ఈ రసాన్ని మీరు రోజు ఉదయం, సాయంత్రం తాగడం వల్ల జీర్ణక్రియకు మంచిది.