Ice Bath : ‘ఐస్ బాత్’ చేస్తారా.. ఆరోగ్యానికి మంచిదా ? కాదా ?

Ice Bath : సెలబ్రిటీలు ఏది చేస్తే అది కాపీ కొట్టడం ఫ్యాన్స్‌కు అలవాటుగా మారింది.

  • Written By:
  • Publish Date - March 16, 2024 / 08:50 PM IST

Ice Bath : సెలబ్రిటీలు ఏది చేస్తే అది కాపీ కొట్టడం ఫ్యాన్స్‌కు అలవాటుగా మారింది. తాజాగా కొందరు సెలబ్రిటీలు ఐస్ బాత్‌ చేశారు. దీంతో వాళ్ల ఫ్యాన్స్ కూడా దానిపై ఆసక్తిని పెంచుకున్నారు. ఐస్ బాత్ (Ice Bath) ఎలా చేయాలి ? అది ఆరోగ్యానికి మంచిదా ? కాదా ? అనే దానిపై గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దీనితో ముడిపడిన వివరాలు తెలియాలంటే కథనం చదవాల్సిందే.

We’re now on WhatsApp. Click to Join

బాత్ టబ్ నిండా ఐసు ముక్కలు వేసుకుని.. అందులోనే కూర్చోవడాన్నే ఐస్ బాత్ అని పిలుస్తారు. సమంత, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి సెలబ్రిటీలంతా ఐస్ బాత్ చేసి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేయడంతో ఈ టాపిక్‌పై జనాసక్తి పెరిగింది. తాజాగా ‘రాజ రాజ చోర’, ‘రెజీనా’ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించిన సునయనా సైతం ఐస్ బాత్‌లో మునకేసింది.  బాత్ టబ్‌లో కాకుండా.. నేచురల్ ఐస్ వాటర్‌లో నేరుగా దిగి అందులో కాసేపు ఉంటే ‘కోల్డ్ ప్లంగింగ్’ అంటారు.కోల్డ్ ప్లంగింగ్‌లో తల నుంచి పాదాల వరకు పూర్తిగా ఐస్ వాటర్‌లో మునగాలి.

Also Read :Narendra Modi : అక్కడ పెట్రోల్, డీజిల్ ధర రూ.15 తగ్గించిన కేంద్రం

కోల్డ్ ప్లంగింగ్ చేస్తే ఇన్ని లాభాలా ?

  • కోల్డ్ ప్లంగింగ్ వల్ల శరీరంలో వాపులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. జిమ్ వర్కవుట్ తర్వాత కలిగే కండరాల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • కోల్డ్ ప్లంగింగ్ చేస్తే  పాత నొప్పులు తగ్గుతాయి.
  • వ్యాధి నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
  • మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
  • శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. కోల్డ్ ప్లంగింగ్ సమయంలో జీవక్రియల వేగం దాదాపు 350 శాతం పెరిగినట్టు గుర్తించారు.
  • చలిని తట్టుకునే శక్తి పెరుగుతుంది.
  • శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించే బ్రౌన్ ఫ్యాట్ పెరుగుతుంది.
  • కోల్డ్ ప్లంగింగ్ చెయ్యడం వల్ల క్యాలరీల ఖర్చు పెరిగి బరువు నియంత్రణలో ఉంటుంది.

కోల్డ్ ప్లంగింగ్ సేఫా ? కాదా ?

  • కోల్డ్ ప్లంగింగ్ అనేది ఒకొక్కరిలో ఒక్కోవిధమైన ఫలితాలను ఇస్తుంది. ఆ ఫలితాలు మంచిగానే ఉంటాయని చెప్పలేం.
  • కోల్డ్ ప్లంగింగ్  చేస్తే  కొందరిలో హైపోథెర్మియా రావచ్చు. హైపోథెర్మియా అంటే శరీర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోతాయి.
  • చర్మం పొడిబారి చిట్లిపొయ్యే ప్రమాదం ఉంది.
  • గుండె మీద ఒత్తిడి పెరగొచ్చు.
  • బీపీ పెరిగే రిస్క్ ఉంటుంది.
  • మెదడుపై ఒత్తిడి పెరిగి ఫిట్స్‌ రావచ్చు.