Site icon HashtagU Telugu

White Onion: తెల్ల ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసా?

Mixcollage 23 Jul 2024 12 49 Pm 2794

Mixcollage 23 Jul 2024 12 49 Pm 2794

ఉల్లిపాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఉల్లిపాయను తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే కొంతమంది ఉల్లిపాయను కూరల్లో తినడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చిగా నేరుగా కూడా తింటూ ఉంటారు. చాలామందికి అనేక రకాల వంటల్లో ఉల్లిపాయ నంచుకోనిదే ముద్ద కూడా దిగదు. ఆ సంగతి పక్కన పెడితే మామూలుగా మనకు మార్కెట్లో ఎర్ర ఉల్లిపాయలు తెల్ల ఉల్లిపాయలు అంటూ రెండు రకాలు లభిస్తూ ఉంటాయి.

ఎక్కువ శాతం మనకు మార్కెట్లో ఎర్ర ఉల్లిపాయలు లభిస్తూ ఉంటాయి. తెల్ల ఉల్లిపాయలు చాలా తక్కువగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది తెల్ల ఉల్లిపాయను తినడానికి కూడా కాస్త ఆలోచిస్తూ ఉంటారు. మరి నిజానికి తెల్ల ఉల్లిపాయ మంచిదేనా? తెల్ల ఉల్లిపాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్రమం తప్పకుండా తెల్ల ఉల్లిపాయ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే తెల్ల ఉల్లిపాయను తినడం వల్ల మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయట. ఇది శరీర మంటను కూడా తగ్గిస్తుందట.

అలాగే అధిక రక్తపోటు లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు రాకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్ల ఉల్లిపాయల్లో ఎన్నో రకాల కూలింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఇవి ఎండాకాలంలో మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. దీనితో పాటుగా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందుకోసం తెల్ల ఉల్లిపాయను సలాడ్ లేదా కూరలతో పాటుగా ఎన్నో రకాలుగా తినవచ్చు. జీర్ణ క్రియను మెరుగుపరచడంలో తెల్ల ఉల్లిపాయ ఎంతో బాగా పనిచేస్తుందట. అలాగే తెల్ల ఉల్లిపాయను తినడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుందట. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జీవక్రియ కూడా పెరుగుతుందని చెబుతున్నారు. తెల్ల ఉల్లిపాయలు తినడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు వైద్యులు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా తెల్ల ఉల్లిపాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుందట. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయట. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచి మీ శరీరంలో ఎన్నో వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుందని చెబుతున్నారు.

note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.

Exit mobile version