Site icon HashtagU Telugu

Raw Coconut: ఏంటి నిజమా.. కొబ్బరి ప్రతీ రోజు తింటే షుగర్ వ్యాధి దూరం అవుంతుందా?

Raw Coconut

Raw Coconut

కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కొబ్బరి వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఫైబర్, ఎసెన్షియల్ మినరల్స్, ఐరన్, మాంగనీస్, కాపర్‌ లు ఉంటాయి. కొబ్బరిని తినడం వల్ల మనకి ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయట. దీనికోసం మనం పచ్చి కొబ్బరిని ఉదయాన్నే తీసుకోవడం, లేదా రోజులో యాడ్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయట. సాధారణంగా కొబ్బరితో చట్నీలు, పొడులు, కూరలు వండుకుంటారు. ఇవి రుచిగా ఉండడమే కాదు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దేవుడికి కొబ్బరి కొట్టగానే బెల్లం లేదా పంచదారతో కొబ్బరిని తింటుంటారు. అయితే పంచదార, బెల్లం కాంబినేషన్‌ తో ఎక్కువగా కాకుండా కొద్దిగా మొత్తంలోనే తీసుకోవాలట.

దీని వల్ల సమస్యలు రావట. అదే విధంగా కొబ్బరిని తింటే ఆరోగ్యకరమైన లాభాలే కాదట. అందానికి కూడా చాలా మేలు జరుగుతుందని చెబుతున్నారు. కొబ్బరిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్‌ ని కంట్రోల్ చేస్తాయట. కొబ్బరి నూనెతో తీసుకుంటూ ఇతర ఫ్యాట్స్‌ ని తగ్గిస్తే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గుతుందట. కొబ్బరి లోనూ అదే గుణాలు ఉంటాయట. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని మెరుగ్గా చేసి రక్తంలో షుగర్ లెవల్స్‌ ని తగ్గిస్తుందట. కొబ్బరిని డైట్‌ లో యాడ్ చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుందట. ఇది రక్తంలో షుగర్‌ ని మరింతగా తగ్గిస్తుందట.

కొబ్బరిని మనం స్నాక్‌ లా తిన్నా కూడా ఇందులోని లారిక్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయట. సిక్‌నెస్‌ ని తగ్గిస్తాయట. కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయట. దీని వల్ల ఇమ్యూనిటీ బలంగా ఉంటుందని చెబుతున్నారు. మనం బరువు తగ్గడానికి కచ్చితంగా హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్స్ ఎక్కువగా తీసుకోవాలట. దీని వల్ల క్రేవింగ్స్ తగ్గడమే కాదు. కడుపు కూడా నిండుగా ఉంటుందట. రోజంతా చిరుతిళ్లు తినకుండా ఉంటాం. ఈ కొబ్బరిని తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. దీని వల్ల బరువు కూడా తగ్గుతారట.

కొబ్బరి తినడం వల్ల కేలరీలు త్వరగా కరుగుతాయట. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయట. దీనిని తినడం వల్ల రోజు మొత్తానికీ కావాల్సిన ఎనర్జీ అందుతుందట. అంతేకాకుండా దీని వల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుందట. బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఇందులోని ఎలక్ట్రోలైట్స్ మెమొరీని పెంచుతాయని,బ్రెయిన్ హెల్త్‌ని కాపాడతాయని చెబుతున్నారు. రోజూ మనం పచ్చి కొబ్బరిని తింటే గట్ హెల్త్ మెరుగ్గా మారుతుందట. దీనికి కారణం కొబ్బరిలో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయట. దీనిని తినడం వల్ల గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ సరిగా ఉంటుందట. కొబ్బరి లో ఫైబర్ మలబద్ధకం సమస్యని దూరం చేసి బౌల్ మూమెంట్స్‌ ని పెంచుతుందని చెబుతున్నారు. దీంతో మలబద్ధకంతో బాధపడేవారు కొబ్బరిని హ్యాపీగా తినవచ్చట.