Site icon HashtagU Telugu

Health Tips: కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. ఇందులో నిజమెంత?

Mixcollage 30 Jul 2024 10 37 Am 1220

Mixcollage 30 Jul 2024 10 37 Am 1220

మామూలుగా మనలో చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్ లలో కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొందరు వేసవికాలంలో మాత్రమే కూల్ డ్రింక్స్ ని ఎక్కువగా తాగుతూ ఉంటారు. కానీ కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి అంత మంచిది కావు అని ఆరోగ్య నిపుణులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా కూల్ డ్రింక్స్ ని తెగ తాగేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫంక్షన్లలో పార్టీలలో ఇలా రకరకాల సందర్భాలలో కూల్ డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు. అయితే చాలామంది కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే జుట్టు రాలిపోతుంది అని చెబుతూ ఉంటారు.

మరి ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కూల్ డ్రింక్స్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల జుట్టు రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా కారణంగా ఇలా జరుగుతుందట. ప్రతిరోజు సోడా ఉన్న కూల్ డ్రింక్ ఎక్కువగా తాగడం వల్ల జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు. జుట్టు జెనటికల్ ప్రాబ్లమ్, యాంక్సైటీ, బాడీ మాస్ ఇండెక్స్, ఇతర ఆరోగ్య సమస్యలు, పొగ తాగే అలవాటు, ఫిజికల్ యాక్టివిటీ ఇలా పలు కారణాల వల్ల రాలుతుంది. అయితే కూల్ డ్రింక్స్ లో ఉండే షుగర్ కారణంగా కూడా పురుషుల్లో జుట్టు రాలుతుందని చెబుతున్నారు. అయితే చాలామంది రోజుకి ఒకటే కదా అని తాగుతూ ఉంటారు.

కానీ ఆ ఒక్క సోడా ఉన్న కూల్ డ్రింక్ మీ జుట్టు ఎక్కువ మొత్తంలో ఊడిపోవడానికి కారణం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి సోడా ఎక్కువగా ఉండకు లింకులు తాగకపోవడమే మంచిదట. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కేవలం ఒక జుట్టు ఊడిపోవడం మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ పేగులకు రంద్రాలు పడడం గ్యాస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.