Site icon HashtagU Telugu

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు కొబ్బరి ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Mixcollage 22 Jan 2024 06 20 Pm 2927

Mixcollage 22 Jan 2024 06 20 Pm 2927

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. షుగర్ రావడానికి అనేక కారణాలు ఉండగా అందులో ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు దానిని అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు వంటింటి చిట్కాలను ఉపయోగించి కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ ఉంటారు. అలాగే ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా షుగర్ వ్యాధిగ్రస్తులు భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో కొబ్బరి కూడా ఒకటి.

చాలామంది కొబ్బరి ఎక్కువగా తింటే పలు రకాల సమస్యలు వస్తాయని ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు కొబ్బరి తింటే ఏం జరుగుతుంది. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కొంతమంది పచ్చికొబ్బరి తింటే మరి కొంతమంది ఎందుకు ఎండు కొబ్బరి తింటూ ఉంటారు. కొందరు పచ్చి కొబ్బరితో వంటకాలు కూడా చేస్తారు. పచ్చి కొబ్బరి చట్నీ కూడా చేస్తారు. అయితే కొబ్బరిని ఎక్కువగా తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయని, కొబ్బరి వల్ల ఎక్కువగా కొవ్వు వస్తుందని చాలామంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. కేవలం అపోహ మాత్రమే.

మీకు షుగర్ ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా కొబ్బరిని తీసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయి. అలాగే కొబ్బరిలో ఉండే ఔషధ గుణాలు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. కొబ్బరిలో ఎక్కువగా పైబర్ ఉంటుంది. అది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొబ్బరిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు పైగా గుండె జబ్బులు తగ్గుతాయి. కొబ్బరిలో అధికంగా మాంగనీస్ ఉంటుంది. అది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఇందులో ఉండే రాగి, ఐరన్ ఎర్రకర్తకణాల వృద్ధికి సాయపడుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చాలా రోగాలను నయం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవాళ్లు అయితే కొబ్బరిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గోధుమలు, అన్నం, జొన్నలు లాంటి వాటికన్నా కూడా కొబ్బరిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కొబ్బరిని తీసుకోగానే శక్తి వస్తుంది. నీరసంగా ఉన్నవాళ్లు వెంటనే యాక్టివ్ అయిపోతారు. దీంట్లో ఉండే ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.

Exit mobile version