Site icon HashtagU Telugu

‎Bread Omelette: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా.. అయితే ఇది మీకోసమే!

Bread Omelette

Bread Omelette

‎Bread Omelette: ప్రస్తుతం ఉన్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కనీసం తినడానికి కూడా సరిగ్గా సమయం ఉండడం లేదు. నచ్చినవి చేసుకోవడానికి కూడా వీలు ఉండటం లేదు. దాంతో స్విగ్గి జొమాటో వంటి వాటి నుంచి ఆర్డర్ చేసుకొని మరి తెప్పించుకుంటున్నారు. ఇంకొందరు ఫాస్ట్ గా అయిపోయే వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మ్యాగీ, పాస్తా, నూడిల్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివన్నీ కూడా తొందరగా అయిపోయే వంటకాలే.

‎ అయితే చాలామంది ఉదయం పూట సమయం లేకపోవడంతో ఆఫీసులకు వెళ్లేవారు బ్రెడ్ ఆమ్లెట్ లేదా మ్యాగీ వంటివి తయారు చేసుకుని తింటూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది బ్రెడ్ ఆమ్లెట్ ని తింటూ ఉంటారు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే బ్రెడ్ ఆమ్లెట్ తినడం ఎంతవరకు ప్రయోజనకరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా బ్రెడ్ ఆమ్లెట్ కొంతవరకు పోషకాలతో కూడిన అల్పాహారం. దీనిలో ఉపయోగించే గుడ్లల్లో ప్రోటీన్ ఉంటుంది. గుడ్లలోని అధిక నాణ్యత ప్రోటీన్ కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుందట. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. సాధారణంగా వారానికి రెండుసార్లు మాత్రమే గుడ్లు తింటే సరిపోతుంది.గుడ్లలోని అమైనో ఆమ్లాలు ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు, చర్మానికి చాలా ముఖ్యం.

బ్రెడ్‌లోని కార్బోహైడ్రేట్లు, గుడ్లలోని ప్రోటీన్, కొవ్వు కలయిక శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందట. వారానికి 7 కంటే ఎక్కువ గుడ్లు తినే ఆరోగ్యవంతులకు కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు. అలాగేపోషకాలను పొందడానికి మల్టీ గ్రెయిన్ బ్రెడ్‌ ను ఉపయోగించడం మంచిదట. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుందని, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని చెబుతున్నారు. కాగా పిండితో చేసిన సాదా బ్రెడ్‌ లో ఫైబర్ ఉండదు. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుందట. ఆమ్లెట్ తయారు చేసేటప్పుడు సంతృప్త కొవ్వులు కలిగిన నూనె లేదా వెన్నను ఎక్కువ పరిమాణంలో ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు. అయితే బ్రెడ్ ఆమ్లెట్లు శరీరానికి త్వరిత శక్తిని అందించినప్పటికీ, బ్రెడ్‌ లో తక్కువ పోషకాలు, అధిక కేలరీలు, అలాగే ఆమ్లెట్ తయారీలో ఉపయోగించే కొవ్వు అల్పాహారం పోషక విలువలను తగ్గిస్తాయట అందువల్ల ప్రతిరోజూ అల్పాహారంగా బ్రెడ్ ఆమ్లెట్లు తినడం మంచిది కాదని దీనివల్ల శరీరంలో పోషక లోపాలు ఏర్పడతాయని చెబుతున్నారు.

Exit mobile version