పిల్లలకు, పెద్దలకు అని తేడా లేకుండా అందరికీ జ్వరాలు(Fever) వస్తున్నాయి. అయితే జ్వరం వచ్చినప్పుడు చాలా నీరసంగా ఉండి మనకు ఓపిక లేక స్నానం చేయడానికి ఇష్టపడరు. కానీ మనకు జ్వరం వచ్చినా కూడా స్నానం(Bath) చేయాలి. చన్నీళ్లతో చేయకూడదు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అప్పుడు మన శరీరం రిలీఫ్ గా అవుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన శరీరంలో నొప్పులు తగ్గుతాయి.
చాలా చల్లగా ఉన్నటువంటి నీటితో స్నానం చేయకూడదు. ఐస్ వాటర్ కూడా వాడకూడదు. స్నానం చేయలేని స్థితి అయితే ఒక టవల్ ను గోరువెచ్చని నీళ్లలో(Hot Water) తడిపి దానిని బాగా పిండి దానితో మన శరీరాన్ని తుడుచుకోవాలి. ఇలా చేయడం వలన మనకు జ్వరం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలకు అయితే జ్వరం వచ్చినప్పుడు వారి శరీరం బాగా వేడిగా ఉంటే ఎప్పటికప్పుడు తడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మన శరీరంలోని వేడి తగ్గుతుంది.
పిల్లలకైనా పెద్దవారైనా ఓపిక ఉంటె స్నానం చేయవచ్చు. కండరాలకు కూడా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయకూడదు అనేది ఒక అపోహ. జ్వరం వచ్చినా ఓపిక ఉంటే స్నానం చేయవచ్చు. దీని వలన మన ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతుంది. మన శరీరంలోని వేడి తగ్గి జ్వరం తగ్గడానికి సహాయపడుతుంది.
Also Read : Appu Yojana : ఆ హీరో పేరిట హెల్త్ స్కీం.. ఆకస్మిక గుండెపోటులపై యుద్ధం