Site icon HashtagU Telugu

Blood Pressure: బీపీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఉదయాన్నే ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే చాలు!

Blood Pressure

Blood Pressure

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో బీపీ సమస్య కూడా ఒకటి. ఈ బ్లడ్ ప్రెషర్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధిక రక్త పోటు కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఉన్నట్టుండి లో బీపీ రావడం లేదా హై బీపీ రావడం వంటి సమస్యలు వస్తాయి. అయితే అలాంటి వారు అరటిపండును ఎప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు. అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాగా అరటిపండు లోని పొటాషియం వల్ల బీపీ అదుపులో ఉంటుందట. హైబీపితో బాధపడేవారు రోజూ ఒక అరటిపండు తినడం మంచిదని చెబుతున్నారు.

రోజూ అరటిపిండు తినడం వల్ల రక్తపోటు చాలా వరకూ తగ్గుతుందట. కాగా పొటాషియం బాడీలోని సోడియం నెగెటీవ్ ఎఫెక్ట్‌ని తగ్గిస్తుందట. ప్రాసెస్డ్ ఫుడ్స్, స్నాక్స్, రెస్టారెంట్‌లో భోజనాల కారణంగా మనలో చాలా మంది తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా ఉప్పుని తీసుకుంటున్నారు. సోడియం కారణంగా బాడీలో నీటిని నిలుపుకునేలా చేస్తుందట. అలాగే రక్తపరిమాణాన్ని పెంచుతుందట. ఇది మీ రక్తపోటుని పెంచుతుందని, పొటాషియం మీ మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు సోడియాన్ని బయటికి పంపడానికి సహాయపడుతుందని, ఇది హైబీపిని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. అరటిపండ్లలో మెగ్నీషియం కూడా తగినంతగా ఉంటుందట. ఇది రక్తనాళాలను సడలించి, రక్తపోటుని తగ్గిస్తుందట.

ఇది రక్తనాళాల గోడల్లో మంటని తగ్గిస్తుందని, అలాగే రక్తనాళాలు ఎంత గట్టిగా, వదులుగా ఉన్నదాన్ని బట్టి హార్ట్ బీట్ రేట్, నరాల పనితీరు నియంత్రించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. హైబీపి ఉన్నవారిలో చాలా మందికి మెగ్నీషియం లోపం ఉంటుంది. అలాంటివారికి మెగ్నీషియం అవసరం. వారు ఒత్తిడికి గురైతే, పూర్తి ఆహారం తీసుకోకపోతే ఒక అరటిపండు తినడం వల్ల పూర్తి మెగ్నీషియం అందదట. కానీ చాలా వరకూ మేలు జరుగుతుందట. అరటిపండ్లని ఆకుకూరలు, నట్స్, ధాన్యాలతో కలిపి తీసుకున్నప్పుడు ఒత్తిడి తగ్గించి నిద్రపోవడానికి హెల్ప్ అవుతుందట. అరటి పండ్లలో కేవలం పొటాషియం మాత్రమే కాకుండా కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుందట. ఇది గుండెకి చాలా మంచిదని, ఇది బీపిని బ్యాలెన్స్ చేస్తుందని, ఇందులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ ని తగ్గిస్తుందని చెబుతున్నారు. దీని వల్ల ధమనుల్లో ఫలకం ఏర్పడదట. అరటిపండ్లలోని ఫైబర్ రకం జీర్ణక్రియని నెమ్మదిస్తుందట. ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుందని చెబుతున్నారు. అరటిపండ్లలో సహజ చక్కెర ఉంటుందట. అయితే దీంతో పాటే ఫైబర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రాసెస్డ్ షుగర్ కంటే ఇవి నెమ్మదిగా జీర్ణమవుతాయట.