Can Sugar Patients Do Fasting?: మధుమేహం ఉంటే ఉపవాసం చేయొచ్చా?

మధుమేహం..ప్రస్తుత రోజుల్లో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున్న వ్యాధి. మారుతున్న కాలానికి

  • Written By:
  • Updated On - July 26, 2022 / 01:37 PM IST

డయాబెటిస్ లేదా మధుమేహం ఉన్నవారు ఉపవాసం చేయొచ్చా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం చేస్తే బరువు ఎక్కువగా ఉన్నవారు తగ్గడానికి దోహదపడుతుంది. శరీరంలో గ్లూకోస్ నిరోధకత తగ్గి, మధుమేహం బారిన పడే అవకాశాలు తగ్గుతున్నాయని వైద్యులు తెలిపారు. అధిక రక్త పోటుతో పాటుగా, గుండె కొట్టుకునే వేగం కూడా, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. కొన్ని గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం వల్ల శరీరంలో మంచి మార్పులు చోటు చేసుకుంటున్నాయని, జబ్బులను తెచ్చిపెట్టే దుష్ప్రభావాలూ తగ్గుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

మధుమేహం ఉన్నవాళ్లు అంతా సక్రమంగానే తింటున్నా కూడా వాళ్లు తీసుకున్న ఆహారం మొత్తాన్ని శరీరం పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదు. అందుకే మధుమేహాన్ని వైద్య పరిభాషలో ఆగ్యుమెంటెడ్‌ స్టార్వేషన్‌ అంటారు.  గంటలకంటే ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే శరీరం పూర్తిగా కొవ్వు పదార్థాల మీదే ఆధారపడటం ఆరంభిస్తుంది. ఈ క్రమంలో వీరి శరీరంలో ఎసిటోన్‌, ఎసిటాల్డిహైడ్‌, బీటా హైడ్రాక్సి బ్యుటిరేట్‌ అనే ఆమ్ల పదార్థాల స్థాయులు చాలా ఎక్కువైపోతాయి. సో మధుమేహులు ఉపవాసం చెయ్యకుండా ఉండటం అవసరం.