Site icon HashtagU Telugu

Intermittent Fasting: కోవిడ్ నుంచి రక్షించే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌.. నిపుణులు ఏం చెప్తున్నారంటే?

Fasting

Intermittent Fasting

ప్రస్తుతం కరోనా మరొకసారి కోరలు చాస్తోంది. రోజురోజుకు చాప కింద నీరులా విస్తరిస్తూ మరొకసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. కాగా ఉపవాసం ఉండేవారికి ఈ కోవిడ్ 19 సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. క్రమం తప్పకుండా ఉపవాసం ఉండే వారిలో కోవిడ్ 19 నుండి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని తాజాగా ఒక అధ్యయనంలో వెళ్లడయ్యింది. ఇంటర్‌మిటెంట్‌ ఉపవాసం చేసేవారు మధుమేహం మరియు గుండె జబ్బుల వ్యాధి నుంచి బయటపడవచ్చట.

వీటితో పాటుగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. బిఎంజే న్యూట్రిషన్ ప్రివెన్షన్ హెల్త్ ప్రకారం క్రమం తప్పకుండా నీరు మాత్రమే తీసుకుంటూ ఇంటర్‌మిటెంట్‌ ఉపవాసం పాటించే కోవిడ్ రోగులకు ఆస్పత్రిలో చేరే ప్రమాదం లేదా వైరస్ కారణంగా మరణించిన రోగుల కంటే తక్కువ ప్రమాదం ఉంటుంది అని తేలింది. కాగా ఇంటర్‌మిటెంట్‌ ఉపవాసం అంటే రోజులో 16 గంటల పాటు ఏమి తినకుండా ఉపవాసం ఉండడాన్ని ఇంటర్‌మిటెంట్‌ ఉపవాసం అని అంటారు. ఈ మిగిలిన 8 గంటల్లో అలా ఉపవాసం ఉన్నవారు తినడం తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఇంటర్‌మిటెంట్‌ ఉపవాసం ఉండేవారికి కోవిడ్ 19 సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట.

అంతేకాకుండా వైరస్ సోకినప్పటికీ ఆ వైరస్ ను ఎదిరించగల శక్తి మన శరీరంకు ఉంటుందట. ఈ ఇంటర్‌మిటెంట్‌ ఉపవాసం వాపును తగ్గించడంతోపాటు హృదయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట. కాగా తాజాగా అధ్యయనంలో వెళ్లడైన విషయం ఏమిటంటే దశాబ్దాలుగా ఉపవాసం ఉంటుందా రోగులలో కోవిడ్ 19 వైరస్ తో పోరాడే శక్తి ఉంటుందట. కాగా టీకాలు పూర్తిగా అందుబాటులోకి రాకముందే వైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన 2005 మంది రోగులను పరిశీలించగా వారిలో 73 మంది నెలకు ఒక్కసారైనా క్రమం తప్పకుండా ఉపవాసం ఉంటారని తెలిపారు. అయితే అలా రెగ్యులర్ గా ఉపవాసం పాటించే వారిలో కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరే సంఖ్య కానీ మరణాలు కానీ తక్కువ అని పరిశోధకులు చెప్తున్నారు.