ఈరోజుల్లో చాలామంది ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఇది వారి మానసిక,శారీరక ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. దీంతో రాత్రిళ్లు మేల్కోంటారు. ఒత్తిడి కారణంగా చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి వారు రాత్రంతా ఏదో ఆలోచిస్తూ గడుపుతుంటారు. అంతేకాదు అర్థరాత్రి వరకు మొబైల్ వాడటం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. మొబైల్ నుండి వెలువడే బ్లూ లైట్ (రేడియేషన్) నిద్రకు భంగం కలిగిస్తుంది. నిద్రించడానికి ఒక గంట ముందు మొబైల్ చూడటం మానేయ్యాలి. అలాగే, నిద్రపోయే ముందు టీ-కాఫీ, పొగ త్రాగకూడదు. కెఫిన్ కూడా నిద్రలేమికి కారణమవుతుంది. అయినప్పటికీ, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే వైద్యులను సంప్రదించండి. ఇది కాకుండా, నిద్రలేమి సమస్య నుండి బయటపడటానికి, మీరు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచా తేనె తింటే చక్కటి ఫలితం ఉంటుంది. తేనెను తీసుకోవడం వల్ల రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది.
నిద్రలేమి నుండి ఉపశమనం:
తేనెను స్లీప్ డాక్టర్ అని కూడా అంటారు. నిద్రపోయే అరగంట ముందు ఒక చెంచా తేనె తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట చక్కెర పెరుగుదల కారణంగా, చాలమంది నిద్రించడానికి ఇబ్బంది పడుతుంటారు. అదే సమయంలో, నిద్రపోయే అరగంట ముందు తేనె తాగడం వల్ల నిద్ర సమస్య నుంచి బయటపడవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు పాలలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి తినండి.
బరువు నియంత్రణలో సహాయపడుతుంది:
అధిక బరువును నియంత్రించడంలో తేనె ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్రక్టోజ్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల పది రెట్లు ఎక్కువ కొవ్వు (ఇతర ఆహారాలు) కరిగిపోతుంది. తేనె కాలేయానికి మంచి ఔషదంలా పనిచేస్తుంది. దీని కోసం, ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి. ఇలా తీసుకుంటే అధిక బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.