సాధారణంగా చేయడానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మనిషి చేయడానికి నిద్ర అన్నది చాలా అవసరం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా నిద్ర లేకపోతే అది మీ మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. నిద్రలేమి సమస్య ఎన్నో రకాల అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది. ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలలో నిద్రలేమి సమస్య కూడా ఒకటి. రాత్రి వేళలో ఎక్కువ సమయం మేల్కొని ఉండటం వల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
అయితే కొందరు మొబైల్ చూస్తూ లేటుగా పడుకుంటే మరి కొంతమంది నిద్ర రాక రాత్రి పూట ఎక్కువ సమయం మేలుకొంటూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టని వారు ఈ ఆహార పదార్థాలను తింటే హాయిగా నిద్ర పడుతుందని చెబుతున్నారు నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అశ్వగంధ.. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. అశ్వగంధ అనేక రకాల అనారోగ్య సమస్యలకు నివారణగా పనిచేస్తుంది. అలాగే చామంతి టీ కూడా నిద్రలేమి సమస్యలకు చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.
చామంతి టీ లో ఉండే ఔషధ గుణాలు మంచి నిద్రకు సహాయపడతాయి. ఈ టీ ని తాగడం వల్ల నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ టీ బ్యాగ్ మార్కెట్ లో లభిస్తుంది. అలాగే నట్స్ లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. బాదం పప్పులు నిద్రలేమి సమస్యలకు బాగా సహాయపడతాయి. బాదం పప్పులు తినడం వల్ల నిద్ర బాగా వస్తుంది. బాదం పప్పులో ఉండే మెగ్నీషియం నిద్రకు బాగా సహాయపడుతుంది. అలాగే గుమ్మడి విత్తనాలు నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే ట్రిప్టోఫాన్,జింక్ లు నిద్రకు బాగా సహకరిస్తాయి.