Influenza : సీజనల్‌ వ్యాధులు విజృంభన..ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచన

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 07:34 PM IST

 

nfluenza: ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్నది. పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు, ఉదయం, సాయంత్రాల్లో చలిగా ఉంటున్నది. వాతావరణ మార్పులతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలో సీజనల్‌ ఫ్లూ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సూచించింది. సీజనల్‌ ఫ్లూ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌తో కలిగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌. ఇది ప్రపంచంలోని అన్నిప్రాంతాల్లోనూ సాధారణమే. చికిత్స లేకుండానే చాలామంది కోరుకుంటున్నారు. ఇన్‌ఫ్లుఎంజా ఇన్‌ఫెక్షన్ దగ్గు, తుమ్ముల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది.

ఇన్ఫెక్షన్‌ను నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఇన్ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా, కుటుంబంలో ఇతరులను దాని బారినపడకుండా సురక్షితంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇన్‌ఫ్లుయెంజాతో జ్వరం, చలి, దగ్గు, గొంతునొప్పి, ముక్కుకారటం, కండరాలు, ఒంటినొప్పులు, అలసట ఉంటాయి. మరికొందరిలో వాంతులు, విరేచనాలు ఉండే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దల్లో కంటే పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇంట్లోనే ఉండడంతో పాటు మిగతా వారికి దూరంగా ఉండాలని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ ధరించడంతో పాటు లక్షణాలుంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోవాలని సూచించింది. ఫ్లూ లక్షణాలు నాలుగు నుంచి వారంలో తగ్గుతాయని.. దగ్గు, అలసట వారాల పాటు కొనసాగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆకలి లేకపోవడం, తినాలనే కోరిక కూడా ఉండదని పేర్కొంది. చాలా మందికి ఫ్లూ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగానే ఉంటుందని.. అయితే తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఉబ్బసం, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు ఫ్లూ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇన్‌ఫ్లుఎంజాను నివారించడానికి పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచే అలవాట్లను అనుసరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణం మారిన ప్రతిసారీ మీరు ఫ్లూ బారిన పడినట్లయితే, రోగనిరోధక వ్యవస్థ బలహీనతకు సంకేతం కావొచ్చని.. వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

read also : Gold: బంగారం కొనాల‌కునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే..?