ఇటీవల కాలంలో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గడం కోసం వాకింగ్ చేయడం, జిమ్ కి వెళ్లడం, డైట్ ఫాలో అవ్వడం, ఆహారం తినడం మానేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా అధిక బరువు మాత్రం తగ్గరు. అయితే మీరు నెల రోజుల్లో బరువు తగ్గాలి అనుకుంటున్నారా, అయితే ఇప్పుడు చెప్పినట్లు చేస్తే నెల రోజల్లోనే ఈజీగా బరువు తగ్గడం ఖాయం అంటున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రోజూ తినే ఆహారంలో కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వాటి వల్ల మనం బరువు పెరుగుతాము. కార్బో హైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్ కలిపి తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గవచ్చు. డైట్ చేసేవాళ్లు అన్ని పోషకాలు బ్యాలెన్స్ గా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలని చెబుతున్నారు. కాగా బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ వంటివి తీసుకోవచ్చని చెబుతున్నారు. వీటిని మోతాదుగా ప్రోటీన్ ఫుడ్స్ తో తింటే బరువు పెరగరట. అలాగే ఉదయం ఉప్మా లేదా వెజిటబుల్స్ వేసిన అటుకుల ఉప్మా తినవచ్చని, ఇడ్లీలను ఎక్కువ చట్నీలతో కాకుండా ఎక్కువ కూరగాయలు ఉన్న సాంబార్ తో తినవచ్చు అని చెబుతున్నారు.ఇడ్లీ కుడా రెండే తినాలి అని చెబుతున్నారు. ఇక ఉప్మా చిన్న గిన్నెడు తినవచ్చట.
అందులోనూ ఎక్కువ కూరగాయలు ఉండేలా చూసుకోవాలని, చెబుతున్నారు. అలాగే వేయించిన పదార్థాలు కూడా తగ్గించాలి. నూనె లేకుండా గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, సలాడ్, చపాతీ లేదా గోధుమ రొట్టె తినవచ్చట. మధ్యాహ్నం అన్నం తిన్నా 200 గ్రాముల లోపే తినాలని, కూరగాయలు, రెండు మూడు కూరలు తినవచ్చట. ప్రోటీన్ కోసం పప్పు తీసుకోవచ్చని చెబుతున్నారు. అలాగే రాత్రి పూట 2 ఇడ్లీలు లేదా చపాతీలు తినాలట. కూరగాయలు, ప్రోటీన్ తీసుకోవచ్చట. గ్రిల్ చేసిన చికెన్ లేదా చేపలు, వెజిటబుల్ సూప్, ఉడికించిన కూరగాయలు, తందూరి చికెన్ చిన్న ప్లేట్లలో తినాలట. అలాగే ఎంత పడితే అంత తినకూడదట. ఎంత తింటున్నారు అన్నది గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అలాగే జంక్ ఫుడ్,ఫాస్ట్ ఫుడ్స్,ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు. స్వీట్ స్నాక్స్ తినడం మానేయాలట. స్వీట్ డ్రింక్స్ వద్దని చెబుతున్నారు.