Jamun : షుగర్ కంట్రోల్ కావాలంటే ఈ పండ్లు తినాల్సిందే..!!

Jamun : పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనతను తగ్గించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి

Published By: HashtagU Telugu Desk
Indian Blackberry Benefits

Indian Blackberry Benefits

వర్షాకాలం రాగానే రుచికి కొంచెం వగరు, కొంచెం తీపిగా ఉండే నేరేడు పండ్లు (Jamun Indian blackberry) మన కళ్లముందు మెరిసిపోతుంటాయి. నలుపు రంగుతో మెరిసే ఈ పండ్లు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ ఇష్టమే. అయితే ఇది కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్యానికి దివ్యౌషధం కూడా అని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండ్లలో విటమిన్ A, C, ఐరన్, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ నియంత్రణ, కంటి ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల, గుండె ఆరోగ్యం వంటి ఎన్నో సమస్యలకు సహజ నివారిణిలా పనిచేస్తాయి.

Royal Challengers Bengaluru: 18 ఏళ్ల ఆర్సీబీ కల సాకారం.. ఐపీఎల్ 2025 విజేతగా బెంగ‌ళూరు!

నేరేడు పండ్లు ముఖ్యంగా మధుమేహ (Diabetes) బాధితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. దీనిలోని జాంబోలిన్, జాంబుసిన్ వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ A, C సమృద్ధిగా ఉండటంతో రెటినాను కాపాడటంలో, కళ్లలో రక్తప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరచడానికి, న్యూరో డిజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షించేందుకు ఇందులోని ఒమేగా-6 కొవ్వులు, న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు సహకరిస్తాయి.

CAG Report: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై భారీ ఆరోపణలు: “దళిత విద్యార్థుల పేరుతో లూటీ!” – సామా రామ్మోహన్ రెడ్డి

ఇక జీర్ణక్రియ మెరుగుదల, బరువు తగ్గడం, రోగనిరోధక శక్తి పెంపు వంటి ప్రయోజనాలు కూడా నేరేడు పండ్ల వినియోగంతో లభిస్తాయి. ఇందులోని ఫైబర్ జీర్ణ సమస్యలు తగ్గించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో ఉపయుక్తంగా ఉంటుంది. పొటాషియం, యాంటీఆక్సిడెంట్ల వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనతను తగ్గించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచే నేరేడు పండ్లు వయస్సును తక్కువగా చూపించే సౌందర్య రహస్యంగా నిలుస్తున్నాయి. మొత్తానికి నేరేడు పండ్లు ఆరోగ్యానికి నిత్యావసరమైన సహజ ఔషధంగా చెప్పుకోవచ్చు.

  Last Updated: 04 Jun 2025, 07:51 AM IST