Corona : భారత్ ను వెంటాడుతున్న కరోనా భయం..కొత్తగా 257 కేసులు

Corona : ఈ నేపథ్యంలో భారత్‌లోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులు, విదేశాల నుండి వచ్చే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
Corona New

Corona New

కొద్దీ నెలలుగా సైలెంట్ గా ఉన్న కరోనా (Corona) మహమ్మారి మళ్లీ విజృభిస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు నమోదు అవుతుండగా..తాజాగా భారత్‌(India)లోను మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా దేశవ్యాప్తంగా 257 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది కొంతవరకు ఆందోళనకరమైన విషయం అయినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ జీవితం కొనసాగించొచ్చని తెలిపింది.

Bill Gates’ Letter : సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత తక్కువగానే ఉందని అంచనా. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం హోం ఐసొలేషన్‌లోనే ఉండగా, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఎక్కువగా లేదని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం వంటి ప్రాథమిక జాగ్రత్తలను తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అదుపులోకి తేయొచ్చని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఆసియా దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా మళ్లీ విజృభిస్తుంది. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో గత కొన్ని వారాలుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులు, విదేశాల నుండి వచ్చే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తంగా, ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండగా ప్రజలు అజాగ్రత్తగా ఉండకపోతే పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉండగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  Last Updated: 20 May 2025, 09:30 AM IST