Kalonji Benefits: ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

కలోంజీ సీడ్స్.. ఇవి జీలకర్రలో ఒక రకమైనవి. వీటిని తెలుగులో నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎన్నో రకాల ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కలోంజీ సీడ్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా

  • Written By:
  • Publish Date - July 17, 2024 / 01:30 PM IST

కలోంజీ సీడ్స్.. ఇవి జీలకర్రలో ఒక రకమైనవి. వీటిని తెలుగులో నల్ల జీలకర్ర అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎన్నో రకాల ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కలోంజీ సీడ్స్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్త్రీలు ఈ కలోంజీ సీడ్స్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు అంటున్నారు వైద్యులు. మరి కలోంజీ సీడ్స్ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలోంజీ సీడ్స్ తినడం వల్ల లివర్ బలంగా మారుతుంది.

అలాగే జీర్ణక్రియ మెరుగ్గా మారి నొప్పులు కూడా తగ్గుతాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచి షుగర్, హైబీపి, క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అలాగే కలోంజీ సీడ్స్ తినడం వల్ల లివర్ బలంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా మారి నొప్పులు తగ్గుతాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా షుగర్, హైబీపి, క్యాన్సర్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. కాగా ఆర్థరైటిస్‌ సమస్యతో బాధపడుతున్న ఆడవారికి కలోంజీ సీడ్స్ చాలా మంచిది. రెగ్యులర్‌ గా తీసుకుంటే నొప్పి మంటని తగ్గిస్తుందట. గర్భం దాల్చాలనుకునే ఆడవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు.

పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా చేసి సంతానోత్పత్తిని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బరువును తగ్గించడంలో కూడా కలోంజీ సీడ్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయట. జీర్ణ క్రియను కంట్రోల్ చేసి ఆకలిని కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతాయట. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కలోంజీ సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయట. అతిగా తినాలనే కోరికల్ని తగ్గిస్తాయట. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగ్గా చేస్తాయట. కలోంజీ తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యతని బ్యాలెన్స్ చేస్తుందట..పీరియడ్స్ రెగ్యులర్‌గా లేని వారికి ఇది చాలా మంచిదని చెబుతున్నారు. దీంతో పాటు మెనోపాజ్ టైమ్‌లో వచ్చే కొన్ని సమస్యల్ని తగ్గిస్తుందట. హార్మోన్స్ కంట్రోల్‌లో ఉంటాయట. మానసిక సమస్యలు, ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్యను నయం చేస్తుందని చెబుతున్నారు పండితులు. కలోంజీ సీడ్స్‌ లో సూర్యరశ్మి నుంచి మన చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయట. కలోంజీ సీడ్స్‌ తో తయారు చేసిన నూనె జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుందట. అలాగే జుట్టు రాలడాన్ని కూడా తగ్గించి, జుట్టు పెరిగేలా చేస్తుందట. దీనిని రెగ్యులర్‌ గా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుందట.

NOTE: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

Follow us