Site icon HashtagU Telugu

Ridge Gourd: బీరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Ridge Gourd

Ridge Gourd

మన వంటింట్లో దొరికి కూరగాయలలో బీరకాయ కూడా ఒకటి. బీరకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.. బీరకాయతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ చాలామంది బీరకాయను తినడానికి అస్సలు ఇష్టపడరు. కాగా బీరకాయలో కొవ్వులు తక్కువగా, నీరు, ఫైబర్‌ ఎక్కువగా ఉండి, పోషకాలు అధికంగా ఉండడంతో పాటు తొందరగా జీర్ణం కావడమే అందుకు కారణం. బీరకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, థైమీన్‌ వంటి పోషకాలు ఉంటాయి.

ఈ పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీరకాయ వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీరకాయలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది తరచుగా తీసుకుంటే ఐరన్‌ లోపం కారణం వచ్చే రక్తహీనత సమస్య నయం అవుతుంది. బీరకాయలో విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది, ఇది ఐరన్‌తో పాటు శరీరంలోని ఎర్ర రక్తకణాల సరైన సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను తగ్గిస్తుంది. బీరకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. అదనంగా, దీనిలో గుజ్జులో సెల్యులోజ్‌, డైటర్‌ ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది పేగుల కదలికను, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు వారి డైట్‌ బీరకాయ తీసుకుంటే ఈ సమస్య దూరం అవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు ఒక గ్లాస్‌ బీరకాయ రసంలో తేనె కలిపి తాగితే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. బీరకాయ శరీరంలోని వ్యర్థాలు, ఆల్కహాల్ అవశేషాలు, జీర్ణం కాని ఆహార కణాలను శరీరం నుంచి తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో లివర్‌ ఆరోగాన్ని, పిత్త పనితీరును పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. లివర్‌ బైల్‌ రసాన్ని విడుదల చేస్తుంది. ఇది లిపిడ్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి హృదయనాళ వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మినరల్స్‌ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి గుండె కణాలు నష్టపోకుండా రక్షిస్తాయి.