Palm Jaggery: తాటిబెల్లం ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాల గురించి మీకు తెలుసా?

తాటి బెల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో తాటి బెల్లం ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ రాను

  • Written By:
  • Publish Date - August 20, 2023 / 10:00 PM IST

తాటి బెల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో తాటి బెల్లం ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ రాను రాను తాకి బెల్లం వినియోగాన్ని తగ్గించేసి తాటి బెల్లంకి బదులు ఎక్కువగా చక్కెరను ఉపయోగిస్తున్నారు. తాటిబెల్లంలోని ఖనిజ లవణాలు చక్కెరతో పోలిస్తే 60 రెట్లు ఎక్కువగా ఉంటాయి. తాటి బెల్లంలో తేమ 8.6 శాతం, సుక్రోజ్‌ 76 శాతం ఉంటుంది. కొవ్వు, ప్రొటీన్ తక్కువగా ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్‌ పంచదార కంటే ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల తాటి బెల్లంలో 308 క్యాలరీల శక్తి ఉంటుంది.

తాటిబెల్లంలో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. అజీర్ణం వంటి జీర్ణ రుగ్మతులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. బెల్లంలోని డైటర్‌ ఫైబర్‌ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. పేగు కదలికలను ప్రేరేపించి జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారికి తాటిబెల్లం ఔషధంలా పనిచేస్తుంది. తాటి బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం చేసిన తర్వాత చిన్న తాటిబెల్లం ముక్క తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.​ అదేవిధంగా తాటి బెల్లం నెలసరి సమస్యలను పరిష్కరించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

నెలసరి నొప్పులతో బాధపడేవారు తాటి బెల్లం తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. తాటి బెల్లం తీసుకుంటే ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఇది మీ శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇది తిమ్మిరి, కడుపు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం పొడి, పావుచెంచా మిరియాలపొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జలుబు వల్ల చేరిన శ్లేష్మాన్ని తొలగించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.