Site icon HashtagU Telugu

Best Fruits For Weight Loss: చలికాలంలో ఈజీగా బరువు తగ్గించే పండ్లు.. అవేంటంటే?

Best Fruits For Weight Loss

Best Fruits For Weight Loss

శీతాకాలం చాలా వరకు మనుషులను బద్ధకస్తులుగా మార్చేస్తుంది. దానికి తోడు చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు,దగ్గు, జలుబు వంటివి మనుషులను బెడ్ పై అలాగే ఉండేలా చేస్తాయి. అయితే చలికాలంలో బరువు తగ్గాలి అనుకున్న వారు వర్కౌట్స్ చేయడానికి ఇష్టపడరు. కానీ వర్కౌట్స్ చేయకూడదు అనుకున్న వారు కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. మరి శీతాకాలంలో ఎటువంటి పండ్లను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరెంజ్ పండలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలో ఉండే కొవ్వును కలిగించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలి అనుకున్న వారికి ఆరెంజ్ మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఆరెంజ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

అలాగే శీతాకాలంలో తరచుగా ఆరెంజ్ ని తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. అలాగే చలికాలంలో జామకాయ బెస్ట్ స్నాక్ అని చెప్పవచ్చు. ఇందులో కాల్షియం, పొటాషియం, ఫైబర్,ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి,ఐరన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఆరెంజ్ తో పోల్చుకుంటే జామకాయలో విటమిన్ సి 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది కమ్యూనిటీని పెంచడమే కాకుండా చలికాలంలో ఇబ్బంది పెట్టే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. అలాగే జామకాయలో ఉండే ఫైబర్ అధిక బరువును నియంత్రణలో ఉంచుతుంది. అంజీర్ పండ్లను తినడం వల్ల అందులో ఫైబర్ పుష్కలంగా ఉండి కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. తద్వారా ఎక్కువగా ఆకలి వేయదు ఈజీగా బరువు తగ్గవచ్చు.

అంజీర్‌లో ఉండే ఫిసిన్‌‌‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చలికాలంలో అంజీర్‌ తరచుగా తింటే బెల్లీ ఫ్యాట్‌ కరుగుతుంది. అంజీర్‌లో పొటాషియం, సోడియం, ఫాస్పొరిక్ ఆమ్లం, ఐరన్, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. అనాస పండు లేదా పైనాపిల్.. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎంజైమ్ బ్రోమెలైన్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ప్రోటీన్ల జీవక్రియలో సహాయపడుతుంది. ఇది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దానిమ్మ బరువు తగ్గించడంలో సూపర్‌ ఫ్రూట్‌ అని చెప్పొచ్చు.

దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరంలోని జీవక్రియను పెంచుతాయి. ఇది ధమనుల లిపిడ్ల నిర్మాణాన్ని నిరోధిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌, హానికరమైన టాక్సిన్‌లను తగ్గిస్తుంది. శరీరం అంతటా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సీతాఫలం పండు టేస్ట్‌లోనే కాదు, పోషకాలూ అద్భుతంగా ఉంటాయి. దీనిలో సి-విటమిన్‌తోపాటు ఎ, బి, కె విటమిన్లూ, ప్రొటీన్లూ, కాల్షియం, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ వంటి మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు.. వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.