Boost Immunity : వేసవిలో ఇమ్యూనిటీని పెంచేందుకు మీ డైట్లో ఈఫుడ్స్ చేర్చుకోండి.

  • Written By:
  • Publish Date - March 29, 2023 / 07:00 AM IST

వేసవికాలం ప్రారంభమైంది. (Boost Immunity)ఇప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. వీటితోపాటు వైరల్ ఇన్ఫెక్షన్లు, కోవిడ్ కూడా భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి బారిన పడకుండా మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీని (Boost Immunity) ఉంచడంలో సహాయపడే ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం. అంటువ్యాధులతో పోరాడడంలో, దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేయడంలో మంచి రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేసవి కాలం హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ నుండి డయేరియా వరకు అనేక రకాల వ్యాధులను తెచ్చిపెడుతుంది. ఈ ఆరోగ్య సమస్యలను నివారించడానికి, వేసవి కాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. తగినంత నీరు తక్కువ కేలరీల ఆహారాలు తినడం వల్ల వేసవి వ్యాధులను దూరం చేసుకోవచ్చు.

మన జీవనశైలే మన శరీరాన్ని అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుంది. మన జీవనశైలి సరిగ్గా ఉంటేనే మనశరీరంలో ఇమ్యూనిటీ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేడి శరీరంలోని ఇమ్యూనిటీనంతా గ్రహిస్తుంది. కాబట్టి, వేసవిలో మీరు మీ ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. వేసవిలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే ఆ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.

జింక్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు:

వేసవిలో మీ ఆహారంలో చాక్లెట్, మాంసం, బచ్చలికూర, గుమ్మడి గింజలు వంటి జింక్-రిచ్ ఫుడ్స్‌ను చేర్చడానికి ప్రయత్నించండి. ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకునే బదులు సహజసిద్ధమైన పద్దతులను ఉపయోగించాలి. వేసవి అనేది సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన సీజన్, దీనికి అదనపు జాగ్రత్త అవసరం.

బోన్ సూప్:

బోన్ సూప్ లో, విటమిన్లు, ఖనిజాలు, వైద్యం వేగవంతం చేసే ఇతర మూలకాలతో సమృద్ధిగా ఉంటుంది. మేక, గొర్రె, కోడి మొదలైన వాటి ఎముకలను ఉడకబెట్టి దీన్ని ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇది వెల్లుల్లితో తయారు చేయబడింది, ఇది శక్తివంతమైన యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇందులో పసుపు, దాల్చినచెక్క, తాజా అల్లం ముక్క అన్నీ కలిపి తయారు చేస్తారు. దీంతో శరీరానికి బలం చేకూరుతుంది.

విటమిన్ సి:

మీ రోజువారీ ఆహారంలో కివి, నారింజ, బొప్పాయి, నిమ్మకాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి. విటమిన్ సి మంచి స్థాయిలో ఉండే పండ్లు, కూరగాయలు. ఇతర విటమిన్లు, ఖనిజాలతో కలిసి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తికి ఆధారం.

ఐరన్ తీసుకోవడం:

ఐరన్ తగినమోతాదులో తీసుకోకుంటే మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది, ఇది రక్తహీనత వంటి పరిస్థితులకు కూడా దారి తీస్తుంది. మాంసం, గింజలు,  క్రూసిఫెరస్ కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఐరన్ అద్భుతమైన మూలాలు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడే, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలను వేసవిలో తినాలని సూచిస్తున్నారు. వైద్యుడిని సంప్రదించి మీ విటమిన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం.